తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ వ‌ర్సెస్ విప‌క్ష బీజేపీ మ‌ధ్య మాట‌ల తూటాలు ఓ రేంజ్‌లో పేలుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ పోరు రోజు రోజుకు మ‌రింత తీవ్రంగా మారుతోంది. ఇక ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టాక సీఎం కేసీఆర్ నుంచి మంత్రుల.. ఇత‌ర ఎమ్మెల్యేలు అంద‌రూ బీజేపీని టార్గెట్‌గా చేసుకుని తీవ్రంగా విరుచుకు ప‌డుతున్నారు. అదే టైంలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు సైతం తాము తెలంగాణ‌కు ఇప్ప‌టికే చాలా ఇచ్చామ‌ని. ఇక ఇవ్వాల్సింది ఏమీ లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొడుతున్నారు.

 

ఇక తెలంగాణ‌లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య ప్రొటోకాల్ వార్ కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య ప్రోటోకాల్ వార్ ఆగ‌డం లూదు. మంత్రి కిష‌న్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు. త‌ల‌సాని ప్రాథినిత్యం వ‌హిస్తోన్న స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం సైతం సికింద్రాబాద్ లోక్‌స‌భ సెగ్మెంట్ ప‌రిధిలోనే ఉంది.

 

ఈ ప్రొటోకాల్ వార్‌లో ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల మెట్రో రైలు ప్రారంభానికి తనకు ఆహ్వానం అందలేదని కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. కిష‌న్‌రెడ్డి టీఆర్ఎస్ ప్ర‌భుత్వ తీరుతో పాటు అధికారుల‌పై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే దీనికి మంత్రి త‌ల‌సాని తాజాగా కౌంట‌ర్ ఇచ్చారు.

 

తన నియోజకవర్గంలో  రైల్వే ఆధునీకరణ పనుల ప్రారంబోత్సవానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్ వస్తున్నా.. తనకు ఆహ్వానం అందలేదని  తలసాని  త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. దీనికి  కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అంత‌టితో ఆగ‌ని త‌ల‌సాని బీజేపీలా తమకు చీప్ పాలిటిక్స్ తెలియవని మండిప‌డ్డారు. ఏదేమైనా తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఈ ప్రొటోకాల్ వార్ ఈ రెండు పార్టీల మ‌ధ్య పెద్ద ర‌గ‌డ‌లా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: