ఎమ్మార్వో వనజాక్షి. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈమె పై దురుసుగా వ్యవహరించడం అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపింది.  అక్రమంగా ప్రభాకర్ అనుచరులు సాగిస్తున్న ఇసుక వ్యవహారాన్ని అడ్డుకునేందుకు వెళ్ళిన ఆమెపై చింతమనేని, ఆయన అనుచరులు దాడికి పాల్పడడంతో అప్పట్లో ఈమె పేరు పాపులర్ అయింది. తప్పు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ని అప్పటి టీడీపీ ప్రభుత్వం వదిలిపెట్టి వనజాక్షికి బదిలీ బహుమానంగా ఇచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. 


దీనిపై ఎమ్మెల్యే ప్రభాకర్ పై టిడిపి ప్రభుత్వం ఏ చర్య తీసుకుపోకుండా సైలెంట్ అయిపోయిందది. ఇకఅక్కడితో ఈ వివాదం ముగిసిపోయింది. మరోసారి వనజాక్షి పేరు వార్తల్లోకి వచ్చింది. ఈ రోజు కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరం వనజాక్షి పై రైతుల పేరుతో కొంత మంది తెలుగుదేశం నాయకులు తిరగబడ్డారు. స్థలాల కోసం నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మార్వో వనజాక్షి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించేందుకు సభను ఏర్పాటు చేశారు. దీనికి వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ కృష్ణా జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ రైతుల తరపున మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉండడంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ బయటికి వెళ్లి పోవాలంటూ ఎమ్మార్వో వనజాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 దీనిని రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధంగా ఉన్న టిడిపి అనుకూలంగా ఉన్న వ్యక్తులు వివాదానికి దిగారు. పరిస్థితులు అక్కడ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. అయితే ఈ సంఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను రైతుల మీద వ్యాఖ్యలుగా  టిడిపి నాయకులు చిత్రీకరించే ప్రయత్నం చేయడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏపీలో చిత్తు చిత్తుగా ఓడిపోయినా గతంలో తమకు చెడ్డ పేరు రావడానికి కారణమైన కొంతమంది అధికారుల పై అప్పటి నుంచి కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: