గత నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందిన గాని శాసనమండలిలో టిడిపి వాటిని అడ్డుకోవడం జరిగింది. వైయస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బిల్లుల విషయంలో చంద్రబాబు తన రాజకీయ చాణక్యం ప్రదర్శించి శాసనమండలిలో చైర్మన్ స్థానంలో తన పార్టీ నాయకులు ఉండటంతో విచక్షణ అధికారంతో వాటిని సెలక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. దీంతో జగన్ ప్రతి విషయంలో శాసనమండలిలో తన నిర్ణయాలకు టిడిపి అడ్డుపడటంతో శాసనమండలిని రద్దు చేసింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో సెలక్ట్ కమిటీ సమావేశం కాకపోవటం మరోపక్క 14 రోజులు పూర్తవడంతో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందినట్లు అని వైసీపీ పార్టీ నాయకులు మంత్రులు కామెంట్ చేశారు. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అవి మనీ బిల్లులు కావని దీంతో అవి సభ ఆమోదించినట్లు కాదని స్పష్టం చేశారు. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసిన పెద్దగా స్పందన రాలేదు.

 

దీంతో చంద్రబాబు నాయుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 189 క్లాజ్-1 ప్రకారం జగన్ కి చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ రూల్ ఆధారం చేసుకుని న్యాయ పోరాటం చేయాలనే దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు టిడిపిలో వినబడుతున్నాయి. అయితే ఈ విషయం కోర్టు దాకా వెళితే ఖచ్చితంగా జగన్ సర్కార్ కి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ మేధావులు కూడా కామెంట్ చేస్తున్నారు. మరో పక్క జగన్ సర్కార్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో అదేవిధంగా చైర్మన్ లెటర్ విషయంలో కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టికల్ 189 క్లాజ్-1 రూపంలో చంద్రబాబు చేతికి వజ్రాయుధం దొరికినట్లే అని ఇది వర్కౌట్ అయితే జగన్ సర్కార్ డిఫెన్స్ లో పడినట్లే అని చాలామంది రాజకీయ మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: