ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఒక సామాన్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి దేశం నివ్వెరపోయేలా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. వరుసగా మూడుసార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజాస్వామ్యానికి మేలు చేసే విధంగా తనతో పోరాడిన శత్రువుతో కూడా స్నేహ హస్తం అందించడానికి రెడీ అయ్యారు కేజ్రీవాల్. మేటర్ లోకి ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ మాట్లాడుతూ...ఢిల్లీ రాష్ట్రంలో పరిపాలన ప్రజలకు మేలు చేకూరే విధంగా సాగాలని కోరుకుంటూ కేంద్రం తో కలిసి పని చేయాలనుకుంటున్నామని తెలిపారు. మోడీ ఆశీస్సులు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి కావాలని కోరారు.

 

ఎలక్షన్ సమయంలో విమర్శించిన వారిని వదిలేసినట్లు అదేవిధంగా క్షమించడం జరిగిందని వాటినన్నింటినీ పక్కన పెట్టి ఢిల్లీ ప్రజలకు మంచి ప్రభుత్వం ఇవ్వటానికి ముందుకు రావాలని కలిసి పని చేయాలి కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ సమయంలో కేజ్రీవాల్ పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయన్ను ఉగ్రవాదితో పోల్చింది. కానీ కేజ్రీవాల్ మాత్రం తన సంక్షేమ పథకాలనే నమ్ముకుని హ్యాట్రిక్ కొట్టారు. 70 సీట్లలో ఏకంగా 62 స్థానాలు కొల్లగొట్టి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకోగా, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం అయినప్పటికీ ఇతర రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులకు ఉన్న అధికారం ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉండవు.

 

ఎందుకంటే ఢిల్లీ లో ఉన్న కొన్ని ప్రాంతాలు కేంద్రం కనుసన్నల్లో ఉంటాయి. ఏది ఏమైనా ఢిల్లీ ప్రజల మేలు కోసం శత్రువుతో కూడా కలిసి పనిచేయడానికి కేజ్రీవాల్ ముందుకు రావటం చాలా హర్షణీయం. దీంతో ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో రావడంతో సామాన్యుడి పార్టీ అంటూ ఆంధ్రాలో విర్రవీగె..పవన్ కళ్యాణ్ కేజ్రీవాల్ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి అని నెటిజన్లు పిలుపునిచ్చారు. ఒక ప్రాంతానికి వెళ్లి ఒక లాగ మరో ప్రాంతానికి వెళ్లి మరో కల కాకుండా సామాన్యులను కేజ్రీవాల్ ఏవిధంగా ప్రభావితం చేయడం జరిగిందో ఆ విధంగా పవన్ రాజకీయాల్లో రాణించాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: