రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడున్న కంపు చాలదన్నట్లుగా బిజెపి ఉద్దేశ్యపూర్వకంగానే చిచ్చు పెట్టిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అనుమానం నిజమే అనిపిస్తోంది. తాజాగా చంద్రబాబునాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై ఐటి దాడుల తర్వాతే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుకోవటమే ఇందుకు నిదర్శనం. ప్రెస్ రిలీజ్ తర్వాతే రాజకీయాలు బాగా వేడిక్కిపోయాయి. ఇందుకు ప్రెస్ రిలీజే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. మామూలుగా డీటైల్డ్ గా నోట్ ఇచ్చే ఐటి శాఖ ఇపుడు మాత్రం అంతా కన్ఫ్యూజన్ గా ఇవ్వటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

6-12వ తేదీ మధ్య జరిపిన సోదాల తర్వాత 13వ తేదీ రాత్రి అధికారికంగా ఐటి శాఖ ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ఎప్పుడైతే నోట్ విడుదలైందో అప్పటి నుండో  రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ప్రెస్ నోట్ లో రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు ఆధారాలను గుర్తించినట్లు ఐటి శాఖ ప్రకటించింది. అలాగే లెక్కల్లో చూపని 85 లక్షల రూపాయల డబ్బు, రూ. 70 లక్షల విలువైన నగలు పట్టుకున్నట్లు చెప్పింది.

 

అయితే ఈ మొత్తంలో ఎవరి దగ్గర ఎంతెంత పట్టుకున్నారు ? ఎవరి దగ్గర ఏమేమి సీజ్ చేశారు ? అనే విషయాలను ఉద్దేశ్యపూర్వకంగానే ఐటి శాఖ దాచిపెట్టినట్లు అనుమానంగా ఉంది. పైగా తాజాగా బయటకు వచ్చిన పంచనామా ప్రకారం శ్రీనివాస్ దగ్గర రూ. 2.56 లక్షలు పట్టుకుని తిరిగి ఇచ్చేసినట్లుంది. డబ్బు సంగతి తర్వాత మిగిలిన డబ్బు, నగలు ఎవరి దగ్గర పట్టుకున్నారన్న విషయాన్ని ఐటి శాఖ చెప్పలేదు.

 

మొదటి ప్రెస్ రిలీజ్ తర్వాత  హైడ్ అవుట్లలోకి వెళ్ళిపోయిన టిడిపి నేతలు పంచనామా రిపోర్టుతో బయటకు వచ్చి వైసిపి పై  రెచ్చిపోతున్నారు. ఈ మొత్తం మీద చూస్తే మొదటి ప్రెస్ రిలీజ్ చేసిందీ ఐటి శాఖే. శ్రీనివాస్ కు పంచనామా రిపోర్టు ఇచ్చింది కూడా ఐటి శాఖే. మరి రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలను ఎవరి దగ్గర పట్టుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఐటి శాఖపైనే ఉంది. కానీ ఆ విషయంలో ఏమీ మాట్లాడటం లేదు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఐటి శాఖ రాష్ట్రంలో రాజకీయ చిచ్చు రేపినట్లు  అనుమానం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: