జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబునాయుడు మీడియా కొత్త రకమైన బురదను చల్లుతోంది. ఏప్రిల్ లో పార్టీకి రాబోయే నాలుగు రాజ్యసభ స్ధానాల్లో రెండింటిని బిజెపికి కేటాయించాలని జగన్ నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి పదే పదే రాస్తోంది. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ టూర్ సందర్భంగా జగన్ కమలం పార్టీ అగ్ర నేతల దగ్గర ప్రతిపాదించినట్లుగా  బిజెపి నేతలు చెప్పారని ఆధ్రజ్యోతి చెబుతోంది. ఈ విషయాన్ని వైసిపి నేతలు ఖండిస్తున్నా పదే పదే తన పద్దతిలో బురద చల్లేస్తోంది.

 

కొంత కాలం వెనక్కు వెళితే ఎన్డీఏలో చంద్రబాబునాయుడు ఉన్నపుడు సురేష్ ప్రభు, నిర్మల సీతారామన్ లను టిడిపి కోటాలో రాజ్యసభ ఎంపిలను చేశాడు. అంటే అప్పుడు చంద్రబాబు చేస్తే ఏమో రాష్ట్రప్రయోజనాల కోసం చేసినట్లు. ఇపుడు జగన్ చేస్తే మాత్రం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేస్తున్నాడట. అసలింతకీ నాలుగు స్ధానాలను జగన్ ఎవరికి ఇవ్వబోతున్నాడనే విషయం ఎవ్వరికీ తెలీదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపికి రాబోతున్న నాలుగు సీట్లలో  మూడు సీట్లను ఎంఎల్సీ కోటాలో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్తలు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, టిడిపి నుండి పార్టీలో చేరిన బీద మస్తాన్ రావులకు ఖాయమైపోయిందని మళ్ళీ ఇదే పత్రిక రాసింది. అంటే ముందు జాగ్రత్తగా నాలుగో సీటును ఖాళీగా వదిలిపెట్టేసింది లేండి.

 

నిజానికి బిజెపికి రెండు రాజ్యసభ సీట్లను త్యాగం చేస్తానని జగన్ ప్రతిపాదించారని రాయటం  కేవలం  బురద చల్లే ప్రయత్నం మాత్రమే. ఇప్పటికైతే వైసిపి-బిజెపిలు ప్రతిపక్షాలే అన్న విషయం తెలిసిందే. ఒకవేళ అటువంటి ప్రతిపాదనే రైట్ అయితే ముందుగా జగన్ ఎన్డీఏలో చేరాలి కదా ? ఎన్డీఏలో చేరితే జగన్ బిజెపికి మిత్రపక్షం అయిపోతాడు కదా ? మరపుడు మిత్రపక్షానికి సీట్లు త్యాగం చేస్తే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఎలాగంటారు ? రాష్ట్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రెండు సీట్లు త్యాగం చేసినట్లు ఎందుకు అనుకోకూడదు ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: