తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం జారీ చేసే జీవోలను వెబ్ సైట్ లో ఎందుకు పెట్టడం లేదని ప్రభుతాన్ని ప్రశ్నించింది. హైదరాబాద్ నగరం భారత సిలికాన్ వ్యాలీలాంటిదని హైదరాబాద్ లో జీవోలను అప్ లోడ్ చేసే సాఫ్ట్ వేర్ లభించటం లేదా...? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బీజేపీ పార్టీ నేత పేరాల శేఖర్ రావు పబ్లిక్ డొమైన్ లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉంచటం లేదని ప్రభుత్వ ఉత్తర్వులు పబ్లిక్ డొమైన్ లో పొందుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 
 
ఈరోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేరాల శేఖర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. పేరాల శేఖర్ తరపు న్యాయవాది కోర్టుకు దాదాపు 40 పేజీల జీవోలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయని ఆ జీవోలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచలేదని పేర్కొన్నారు. హైకోర్టు ఈ నెల 28వ తేదీలోపు జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లో ఎందుకు పొందుపరచడం లేదో తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
హైకోర్టు తదుపరి విచారణను మార్చి నెల 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను దాఖలు చేసిన పేరాల శేఖర్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. గత ఆరు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,04,000 జీవోలను జారీ చేసిందని అందులో సగం పైగా జీవోలను ప్రభుత్వం దాచిపెటిందని హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. పేరాల శేఖర్ ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలన్నీ ఖరీదైన జీవోలని చెబుతున్నారు. 
 
దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల విలువైన జీవోలను ప్రభుత్వం దాచిపెడుతోందని పేరాల శేఖర్ ఆరోపణలు చేస్తున్నారు. భగీరథ జీవోలు, కాళేశ్వరం జీవోలు, కొత్త కలెక్టర్ ఆఫీస్ నిర్మాణంలాంటి ముఖ్యమైన జీవోలను దాచేశారని పేరాల శేఖర్ ఆరోపణలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: