బుచ్చయ్య చౌదరీ...తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ఇక గత రెండు పర్యాయాల నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు 2014లో గెలిచినప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న మంత్రి పదవి దక్కలేదు. సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా బుచ్చయ్యకు పదవి మిస్ అయింది. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన, టీడీపీ అధికారంలోకి రాలేదు.

 

దీంతో ప్రతిపక్షంలో కీ రోల్ పోషిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ బుచ్చయ్యని పక్కనబెట్టేసిన బాబు...ఇప్పుడు మాత్రం పక్కనే తిప్పుకుంటున్నారు. బుచ్చయ్య తనదైన వాక్చాతుర్యంతో ప్రత్యర్ధి పార్టీకి కౌంటర్లు ఇవ్వగలరు కాబట్టి, ఇప్పుడు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కష్టకాలంలో ఉన్న పార్టీకి బుచ్చయ్య మాంచి ఉత్సాహాన్ని తెప్పిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీపై మాటల దాడి చేస్తున్నారు.

 

అటు అసెంబ్లీలో గానీ, బయట మీడియా ముందు గానీ బుచ్చయ్య అధికార వైసీపీకి గట్టి కౌంటర్లే ఇస్తున్నారు. ముఖ్యంగా ఈయన సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. ఫేస్‌బుక్ వేదికగా ప్రతిరోజూ వైసీపీపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. అసలు ఏ మాత్రం మొహమాటం లేకుండా ఏకీపారేస్తున్నారు. వైసీపీ నేతలకు వెరైటీ వెరైటీ పేర్లు పెట్టి సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈయన పోస్టులకు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. వైసీపీకి సరైనోడు దొరికాడని మాట్లాడుకుంటున్నారు. అలాగే లేటు వయసులో బుచ్చయ్య తాత ఫుల్ ఫైర్‌లో ఉన్నారంటూ చలోక్తులు విసురుతున్నారు. ఇక బుచ్చయ్య పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 

అయితే సాధారణంగా రాజకీయ నాయకుల ఫేస్ బుక్ పేజ్‌లు ఎవరైనా అడ్మిన్‌లు మెయిన్‌టైన్ చేస్తూ పోస్టులు పెడతారు. కానీ బుచ్చయ్య చౌదరీ మాత్రం తన పేజ్‌కి తానే అడ్మిన్‌గా ఉంటూ తన సొంత వ్యాఖ్యనాలతో వైసీపీపై సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికైతే బుచ్చయ్య తాత కాస్త ఫైర్‌లోనే ఉన్నారు. మరి ఈ ఫైర్ ఎంతకాలం ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: