ఎప్పుడైతే ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోయిందో అప్పటి నుంచి దగ్గుబాటి ఫ్యామిలీకు కష్టాలు పెరిగిపోయాయి. వారి రాజకీయ జీవితానికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరమైపోయారు. ఏదో 2019లో కుమారుడు కోసం వైసీపీలోకి వచ్చిన, తర్వాత మాత్రం పరిస్తితులు సరిగా లేకుండా పోయాయి. ఎన్నికల్లో ఓడిపోయి, తర్వాత పూర్తిగా రాజకీయాల్లో కనబడకుండా వెళ్ళిపోయారు.

 

ఇక భర్త, కుమారుడు పరిస్తితి బాగోకపోయిన బీజేపీలో ఉన్న పురంధేశ్వరి(చిన్నమ్మ) పరిస్తితి ఏమన్నా బాగుందంటే అది లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన చిన్నమ్మ, 2004, 2009 ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రి కూడా అయింది. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఆమె, బీజేపీలోకి వచ్చేసింది. ఇక 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ తరుపున రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె ఓడిన కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే ఆమెకు ఎలాంటి పదవి రాలేదు.

 

ఇక 2019 ఎన్నికల్లో  బీజేపీ తరుపున ఎలాంటి పొత్తు లేకుండా వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. కేవలం 33 వేల ఓట్లు డిపాజిట్లు కోల్పోయారు. అయితే మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన చిన్నమ్మకు ఇంకా ఎటువంటి పదవి రాలేదు. భవిష్యత్‌లో కూడా వస్తుందని గ్యారెంటీ లేదు. అయితే ఆమె పదవికే కాదు. గెలుపుకు కూడా గ్యారెంటీ లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ-జనసేనలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు కలిసిన గెలుపు చాలా కష్టం.

 

ఏపీలో పాతుకుపోయి ఉన్న వైసీపీ, టీడీపీలని దాటి గెలుపు రావడం అంత సులువు కాదు. పైగా ఏపీ ప్రజలు బీజేపీపై ఇంకా గుర్రుగానే ఉన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి ఏమన్నా సాయం చేస్తే కొంచెం పరిస్తితి మారోచ్చు. కానీ అది కూడా గెలుపు వరకు తీసుకెళ్లడం కష్టం. కాబట్టి చిన్నమ్మ బీజేపీలో ఉంటే పావలా ఉపయోగం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: