ఏపీలో పల్లెలు, పట్టణాలు, నగరాలు మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అతి త్వరలోనే స్థానిక సంస్థల సమరం జరగనుంది. వరుసగా పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ స్థానిక సమరంలోనే గుంటూరు కార్పొరేషన్‌కు కూడా మోక్షం కలిగే అవకాశముంది. అసలు గుంటూరుకు కార్పొరేషన్‌ 2005 సెప్టెంబర్‌ 5 ఎన్నికలు జరగ్గా 2010 సెప్టెంబర్‌లో పాలకవర్గం గడువు ముగిసింది.

 

ఇక అప్పటి నుంచి నగరంలో ఎన్నిక జరగలేదు. కొన్ని గ్రామాల విలీన సమస్య ఉండటంతో ఎన్నికలకు బ్రేక్ పడుతూ వచ్చింది. గతంలో నగరంలో 52 వార్డులు ఉన్నాయి. అయితే నగరం చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలని కార్పొరేషన్‌లో విలీనం చేయాలని చూస్తే, గ్రామాల నుంచి వ్యతిరేకిత వచ్చింది. అయితే ఈ సమస్య ఇప్పుడు కొలిక్కి రావడంతో వార్డుల విభజన జరిగి, ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాలు విలీనం కావడంతో కార్పొరేషన్ 57 వార్డులకు పెరిగే అవకాశముంది.

 

ఈ కార్పొరేషన్ ఎన్నిక జరిగితే అధికార వైసీపీకు గెలిచే ఎక్కువగా అవకాశాలున్నాయని తెలుస్తోంది. అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. కాకపోతే మూడు రాజధానులు నిర్ణయం అమరావతి పక్కనే ఉన్న గుంటూరు ప్రజలకు ఇష్టం లేదని అర్ధమవుతుంది. అయితే ఇలా రాజధాని విషయంలో వ్యతిరేకిత ఉన్న అది ఎన్నికల్లో ప్రభావం చూపే ఛాన్స్ లేదు. ఎందుకంటే నగరంలో ఉన్న గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట.

 

ఇక్కడ  వైసీపీ నుంచి మహ్మద్ ముస్తఫా షేక్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2019 ఎన్నికల్లో దాదాపు 24 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఈస్ట్‌లో ఉన్న మెజారిటీతోనే గుంటూరు కార్పొరేషన్ గెలిచే ఛాన్స్ ఉంది. అయితే గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి..ఇప్పుడు వైసీపీకి మద్ధతు తెలుపుతున్నారు. ఇక దీని బట్టి చూసుకుంటే గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమే. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత జరిగే గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ హవా నడవడం పక్కా. 

మరింత సమాచారం తెలుసుకోండి: