తిరుపతి నిత్యం రద్దీగా ఉండే దేవస్థానం. రోజుకు కొన్ని వేల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ దేవాలయానికి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండే కాక దేశాల నలుమూల నుండి వస్తుంటారు. వేంకటేశ్వర స్వామిని ఆపద మొక్కుల వాడని అని కోరిన కోరికలు తీర్చే వాడని నమ్ముతారు. 

 

తిరుపతికి పూర్వములో కాలి నడకన ఏడు కొండలు ఎక్కి స్వామి వారిని దర్శించుకునే వారు. కాల క్రమంగా దేవాలయం అభివృద్ధి చెందింది. ఏడు కొండల పైకి రోడ్డును కూడా వేశారు. ప్రస్తుతం చాల మంది భక్తులు రోడ్డు మార్గానే వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మొక్కులు మొక్కిన వారు దాని చెల్లించడం కోసం మెట్ల మార్గంలో స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి ధనిక, పేద, సినీ పరిశ్రమ వారు అంటూ తేడా ఉండదు.  

 

తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలంరేపింది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలోని 270 మెట్టు దగ్గర దుప్పిని చిరుత చంపి తినింది. సోమవారం మెట్లపై దుప్పి, రక్తపు మరకలు చూసిన భక్తులు షాక్ తిన్నారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు దుప్పిని అక్కడి నుంచి తొలగించారు.. మెట్లను శుభ్రం చేశారు.

 

ముందస్తు జాగ్రత్తగా మెట్టు మార్గంలో కొద్దిసేపు భక్తుల్ని అధికారులు అనుమతించలేదు. మెట్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసి తర్వాత అనుమతించినట్లు తెలుస్తోంది. చిరుత సంచరిస్తుందని తెలియడంతో భక్తులు భయాందోళనల్లో ఉన్నారు. భక్తులు తిరుమలకు వెళ్లేందుకు రోడ్డు మార్గంతో పాటూ మరో రెండు మార్గాలు ఉన్నాయి.

 

రెండు మార్గాల్లో అలిపిరి, మెట్టు మార్గాలు ముఖ్యమైవని.. నడకదారిన తిరుమలకు వెళ్లాలనుకునే మెట్టు, అలిపిరి వెళ్లి తిరుమలకు బయల్దేరతారు. మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవాలంటే.. అంతా అటవీప్రాంతం ఉంటుంది, జంతువులు సంచరిస్తుంటాయి. అందుకే రాత్రి వేళల్లో ఈ మార్గంలో భక్తుల్ని అనుమతించరు.

మరింత సమాచారం తెలుసుకోండి: