నేటి సమాజములో బైక్ ని ఇష్టపడని యువకులు అంటూ ఎవరు లేరు. అలాంటి వారి కోసమే సరికొత్త బైక్ మార్కెట్లోకి వచ్చింది. ద్విచక్రవాహనాల్లో అందే వేసిన చేయి టీవీఎస్ సంస్థది. ముఖ్యంగా ఆ సంస్థ నుంచి వచ్చిన అపాచీ మోటార్ సైకిల్ యువతలో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. 2013లోనే టీవీఎస్ సంస్థ.. ప్రముఖ ఆటో దిగ్గజం బీఎండబ్ల్యూతో కలిసి భారత్ లో ద్విచక్రవాహనాలను రూపొందించాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. 

 

అయితే అప్పటి నుంచి వీరి కాంబినేషన్ లో వచ్చింది మూడు మోటార్ సైకిళ్లే. అందులోనూ టీవీఎస్ ట్యాగ్ తో విడుదలైంది ఒక్కటంటే ఒక్క మోడలే. తాజాగా వీరిద్దరు కలిసి మరో సరికొత్త అపాచీ మోడల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీవీఎస్ అధ్యక్షుడు, సీఈఓ కేఎన్ రాధాకృష్ణనే స్వయంగా వెల్లడించారు.

 

బీఎస్6 పార్మాట్లోకి అప్ డేటైన అపాచీ ఆర్ఆర్ 310 లాంచింగ్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. అపాచీ ఆర్ఆర్ 310 పేరుతో రానున్న ఈ బైక్ వచ్చే ఏడాది లాంచ్ అవనున్నట్లు ఆయన ఖరారు చేశారు. ఆర్ఆర్ 310 బైక్ లో ఉన్నటువంటే ఫీచర్లే ఇందులోనూ పొందుపరచనున్నారు. అందులో ఇంజిన్ నే ఈ సరికొత్త ఆర్టీఆర్ 310 మోడల్లోనూ వాడనునుట్లు చెప్పారు.

 

ఆర్ఆర్ 310 ఇంజిన్ 34పీఎస్ పవర్, 27.3ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండానాలుగు రైడ్ మోడ్ ల్లో ఇది ప్రయాణిస్తుంది. ఆర్ఆర్ 310 మోటార్ సైకిల్ ను బాగా హ్యాండిల్ చేయవచ్చు. ఇది స్పోర్ట్స్ బైక్ కావడం వల్ల రానున్న ఆర్టీఆర్ 310 మోడల్లో కొన్ని అదనపు ఫీచర్లు, ప్రత్యేకతలను పొందుపరచడమే కాకుండా అర్బన్ కండిషన్లకూ తగినట్లుగా తయారు చేయనున్నారు. 

దిల్లీ ఎక్స్ షోరూంలో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 బీఎస్6 ధర రూ.2.40లక్షలుగా సంస్థ నిర్దేశించింది. ఈ బైక్ లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఎరుపు, నలుపు రంగుల్లో లభ్యమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: