ఫిబ్రవరి 18వ తేదీన చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు జన్మించిన ఆ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి..!

 

 చైతన్య మహాప్రభు జననం : రాధాకృష్ణ సాంప్రదాయాన్ని పరాకాష్టకు తీసుకెళ్లిన ఒక మహా భక్తుడు చైతన్య మహాప్రభు. ఈయన 1486 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించారు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే... ఇలా రాధాకృష్ణ మతాన్ని ప్రచారం చేస్తున్న కాలంలోనే.. చైతన్య మహాప్రభు బెంగాల్ ఒడిశాలలో కూడా అదే మతాన్ని ప్రచారం చేశారు. 

 

 అలెస్సాంన్ద్రో  ఓల్డ జననం : ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త అయిన అలెస్సాండ్రో  ఓల్డ 1745 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించారు. 1800 బ్యాటరీ ఆవిష్కరణతో ఈయన ప్రసిద్ధికెక్కారు. 

 

 రామకృష్ణ పరమహంస జననం : ఆధ్యాత్మిక గురువైన శ్రీరామకృష్ణ పరమహంస 1836 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించారు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి రామకృష్ణ పరమహంస. 19 వ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం లో ఈయన ప్రభావము ఎంతగానో ఉంది. భారతదేశంలోని మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి తేదీలు  మరియు ఇతర విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రామకృష్ణ పరమహంస జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు ఉన్నాయి. కాగా రామకృష్ణ పరమహంస ప్రత్యేక శిష్యుల్లో  స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద,  స్వామి శివానంద, స్వామి త్రిగుణాతీథ నంద,  స్వామి అభినంద, స్వామి నిత్యానంద,  స్వామి శారదానంద  వీరి ద్వారా రామకృష్ణమిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరు సన్యాస శిష్యులు. 

 

 గురు గోల్వాల్కర్ జననం : రాష్ట్రీయ స్వయంసేవక్ సంగ్ పూర్వ సర్ సంఘచాలక్ గురు గోల్వాల్కర్ 1906 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించారు. 

 

 సాజిద్ నడియాద్వాలా జననం : భారత చలన చిత్ర నిర్మాత అయిన సాజిద్ నడియాద్వాలా 1966 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించారు. ఈయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 

 

 ఎమ్మెస్ చౌదరి జననం : మాధవ మధుసూదన చౌదరి 1978 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించారు. తెలుగు నాటక రచయిత దర్శకుడు మరియు సినిమా నటుడు అయిన ఎంఎస్  చౌదరి ఎన్నో ఏళ్ల పాటు సినీ రంగంలో కొనసాగారు. 

.

మరింత సమాచారం తెలుసుకోండి: