కేంద్రంలోని ఎన్డీఏ  ప్రభుత్వం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరనుందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి . అయితే ఆ పార్టీ నేతలు మాత్రం అటువంటిదేమీ లేదని , అదంతా  ఉత్తుత్తి ప్రచారమేనని కొట్టి పారేస్తున్నారు . కేంద్ర కేబినెట్ లో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గనుక చేరితే ఆ పార్టీ కొత్త కష్టాలు తప్పేలా కన్పించడం లేదు .  ఎన్డీఏ సర్కార్ తీసుకువచ్చిన ఎన్ఆర్సీ , సీ ఏఏ బిల్లుకు మద్దతిస్తే మైనార్టీలు ఆ  పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొనడం , ఒకవేళ ఎన్ఆర్సీ , సీ ఏఏ  చట్టాన్ని  వ్యతిరేకిస్తే బీజేపీ తో శత్రుత్వం  పెరగడం  ఖాయంగా కన్పిస్తోంది .

 

దీనితో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి , వెనుక గొయ్యి అన్న చందంగా మారింది . పార్లమెంట్ లో ఇప్పటికే ఎన్ ఆర్సీ కి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చింది . అయితే ఈ బిల్లుపై అవగాహన లేకుండా మద్దతునిచ్చామని  ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొనగా   , దానికి టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు . సీ ఏఏ కు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన  డిమాండ్ చేయడమే కాకుండా , తమ పార్టీ ఒకవేళ మద్దతునివ్వకపోతే  తాను పార్టీ కి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు .

 

ఇక సీ ఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం చేయించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఒప్పిస్తానని అంజాద్ బాషా పేర్కొనడం పరిశీలిస్తే , ఇప్పుడు బీజేపీ తో తమ సంబంధం పై ప్రజలకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  స్పష్టత ఇవ్వాల్సిన ఆవశ్యకత కన్పిస్తోంది . ఒకవేళ ఎన్డీఏ  సర్కార్ లో చేరాలనుకుంటే మాత్రం అధికార పార్టీ మైనార్టీల వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందన్న వాదనలు లేకపోలేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: