హీరోయిన్లు అంటే అందాన్ని చూపించాలి .. అప్పుడే వారికున్న క్రేజ్ మరింత పెరుగుతుంది..అందుకే కడ్చేఫ్ వాడుకోవడం పనిగా పెట్టుకున్నారు చాలా మంది..ఇంకో విషయం ఏమిటంటే సినీ తారలకు సంబంధించిన ఏదైనా పార్టీలు లేదా ఫంక్షన్లకు వెళ్లేటపుడు అందులోని ప్రత్యేకంగా కనిపించడానికి వారు ఏవేవో చేస్తుంటారు.. ఇంకా స్టార్ హీరోయిన్ అంటే చెప్పనక్కర్లేదు.. డ్రెస్ లతో అందరి దృష్టిని తమ వైపుకు లాగేసుకుంటారు..

 

 

ఫిలింఫేర్ అవార్డ్స్ 2020లో ఆలియా మిరుమిట్ల గురించి ఏమని చెప్పాలి? రాజీ - ఉడ్తా పంజాబ్ తర్వాత `గల్లీ బాయ్`లో నటనకు ఉత్తమ నటిగా మరోసారి అవార్డును కొల్లగొట్టింది. ఇక ఈ వేదికపై భామలు ఎందరు ఉన్నా.. ఆలియా లుక్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పసుపు - పింక్ కాంబినేషన్ డిజైనర్ డ్రెస్ లో ఆలియా మెరుపులు మెరిపించింది. కేవలం నటనలోనే కాదు.. ఫ్యాషన్ అండ్ స్టైల్ కంటెంట్ లో తనని కొట్టేవాళ్లు లేరని ప్రూవ్ చేసింది మరోసారి.

 

 

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` (2012) చిత్రంతో తెరంగేట్రం చేసిన అలియా భట్ సమకాలీన నటీమణుల్లో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా నిరూపించుకుంది..ఆమె నటన సినిమాల వల్ల అభిమానులను పోగేసుకుంటూ వచ్చిన అమ్మడు తెలుగులోనే కాకుండా పలు ఇండస్ట్రీలలో నటిస్తూ వస్తుంది..తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అర్ అర్ అర్ చిత్రంలో ప్రముఖ పాత్రలో కనిపించింది...

 

 

2020 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ సరసన నటిస్తోంది. అలాగే అయాన్ ముఖర్జీ `బ్రహ్మాస్త్రా`లో రణబీర్ కపూర్- అమితాబ్ బచ్చన్- మౌని రాయ్ - అక్కినేని నాగార్జున వంటి అగ్రతారాగణంతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం 2020 డిసెంబర్ 4 న థియేటర్లలోకి రానుంది. మహేష్ భట్ తెరకెక్కిస్తున్న `సడక్ 2` లో ఆదిత్య రాయ్ కపూర్- పూజా భట్ -సంజయ్ దత్ లతో కలిసి నటిస్తోంది. కరణ్ జోహార్ తక్త్ లోనూ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో రణవీర్ సింగ్- కరీనా కపూర్ ఖాన్- అనీల్ కపూర్- జాన్వీ కపూర్- భూమి పెడ్నేకర్ -విక్కీ కౌషల్ తదితరులు నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో `గంగూబాయి కతియావాడీ... సినిమాలో కనిపించనుంది.. మొత్తానికి ఆమె వేసుకున్న డ్రెస్ ప్రత్యేక ఆకర్శన నిలవడమే కాకుండా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: