ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. రివర్స్ టెండరింగ్ అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేదవాళ్లకు అందుబాటులోకి ఇంగ్లీష్ మీడియం ఇంకా అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు జగన్. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలన దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యింది. తొమ్మిది నెలల కాలంలోనే అద్భుతమైన పరిపాలన జగన్ అందిస్తున్నారని దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పొగడటం జరిగింది. అయితే తాజాగా మరో ఒక సంచలన నిర్ణయం 120 సంవత్సరాలలో ఎవరు చేయలేని కార్యక్రమాన్ని జగన్ చేయటానికి పూనుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 18వ తారీకు నుండి పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పని చేయటానికి జగన్ సర్కార్ కొన్నట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

 

ఈ పని సక్సెస్ అయితే భూ వివాదాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. దాదాపు 120 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో సమగ్ర భూ సర్వే జరిగింది. ప్రతీ ముప్పై సంవత్సరాలకు ఒకసారి సర్వే జరగాల్సి ఉన్నా ఆ దిశగా గత ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. దాంతో అనేక భూవివాదాలు పెరిగిపోతూ వచ్చాయి. గ్రామాల్లో కరణాల వ్యవస్థ ఉన్నంత వరకు భూరికార్డుల నిర్వహణ బాగానే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ హయాంలో కరణాల వ్యవస్థ రద్దు చేసిన తరువాత భూ రికార్డుల నిర్వహణ పూర్తిగా దెబ్బతిందని అనేక సమస్యలు పెరుగుతూ వచ్చాయి అని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెబుతున్నారు.

 

జగన్ పాదయాత్ర సమయంలోనూ సమగ్ర భూ సర్వే పై హామీ ఇచ్చారు. భూ రికార్డులు సరిగా లేనందున...ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సివిల్ కేసు లో 60 శాతానికి పైగా భూవివాదాలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. సమగ్ర భూ సర్వే వల్ల దాదాపు 90 శాతం వరకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రికార్డుల శుద్దీకరణ భూముల రీ సర్వే శాశ్వత భూ హక్కుల కల్పన చేయగలిగిన అప్పటికే భూ వివాదాలకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని జగన్ సర్కారు ఈ పనికి పూనుకున్నట్లు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే జగన్ ఒక సరికొత్త చరిత్ర సెన్సేషనల్ హిస్టరీ సృష్టించినట్లే అని రాజకీయ విశ్లేషకులు ఈ భూ సర్వే పై కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: