మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా పరువు హత్యలు జరిగి పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. కేవలం ప్రేమించారన్న కారణంతో సొంతవారినే అత్యంత కిరాతకంగా చంపి చాలామంది కటకటాల పాలవుతున్నారు. ఇటువంటి ఘటనలను సినిమాల్లో చూస్తేనే మనకి ఎంతో బాధగా ఉంటుంది. మరి నిజజీవితంలో అలాంటివి జరిగితే ప్రియుడిని లేదా ప్రియురాలిని కోల్పోయిన వారి వ్యధ మాటల్లో చెప్పలేం. ప్రాణాల కంటే పరువు ముఖ్యమా? మనసుకి నచ్చిన వాడిని ప్రేమిస్తే చంపేస్తారా? అనే ప్రశ్నలు ఎన్ని తలెత్తినా కొంతమంది కుటుంబ సభ్యలు మాత్రం తమ బిడ్డల్ని అన్యాయంగా చంపేస్తున్నారు. ఇటువంటి ఒక ఘటన మీరట్ లో జరిగి కలకలం రేపుతోంది. 

 


వివరాలు చూసుకుంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాకి చెందిన టీనా చౌదరి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే ఆ బాలిక ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను బెదిరిస్తూ లవ్ ఎఫైర్ ని కొనసాగిస్తే చంపేస్తామని చెప్పారు. కానీ ఆమె ప్రేమించడం మాత్రం ఆపలేదు. ఈ విషయం కాస్త అన్న అయిన (కజిన్) ప్రశాంత్ కు తెలిసింది. తరువాత తమ కుటుంబ పరువు, ప్రతిష్ఠని మంటగల్పుతుందని టీనా తల్లిదండ్రులు ప్రశాంత్ కు చెప్పారు. దీంతో ప్రశాంత్ ఆమెపై పగ బట్టాడు. శనివారం నాడు ప్రశాంత్ తన ఫ్రెండ్ సల్మాన్ బర్త్ డే పార్టీకి అటెండ్ అయ్యాక సార్ధనా ఏరియాలోని టీనా వాళ్ళ ఇంటికి వచ్చాడు. పూటుగా మద్యం సేవించిన అతడు టీనాని తన కుటుంబ సభ్యుల ఎదుటే గన్ తో కాల్చి చంపేశాడు. ఆపై అక్కడి నుండి పరారయ్యాడు. 

 

అయితే, టీనా మరణించిన ఆరు గంటల తరువాత కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఒక ఆసుపత్రికి తరలించారు. తమ కూతురిని దొంగలు కాల్చారని వారు హాస్పిటల్ లో చెప్పుకొచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బింది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు... టీనా కుటుంబ సభ్యులను ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే వాళ్లు పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో టీనా బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించాలని పోలీసులు చెప్పగా దానికి వారు అంగీకరించలేదు. ఆ సందర్భంలోనే పోలీసులకు వారిపైన అనుమానం వచ్చింది. దాంతో పోలీసులు తమదైన శాలిలో వారిని విచారించగా అస్సలు విషయాన్ని బయటపెట్టి అక్కడవున్న వారందరిని విస్తుపోయేలా చేసారు. తమ ఇంట్లో చిమ్మిన టీనా రక్తపు మరకలను తుడిచేయడంతో పాటు ఇతర ఆధారాలను మాయం చేసేందుకు మృతురాలి పేరెంట్స్ ప్రయత్నం చేసారని కానీ తాము మొత్తం ఎవిడెన్స్ ని స్వీకరించగలిగామని పోలీసులు తెలిపారు.

 

 

ప్రస్తుతం టీనా మృతికి కారణమైన ప్రధాన నిందితుడు ప్రశాంత్ ని పట్టుకొని... అతడితో పాటు మృతురాలి యొక్క 4 కుటుంబ సభ్యులను మర్డర్, డిస్ట్రాయ్ అఫ్ ఎవిడెన్స్, నేర కుట్ర కింద సార్ధనా పోలీసులు అరెస్ట్ చేసారు. పోస్ట్ మార్టంలో చౌదరి బుల్లెట్ గాయాల కారణంగా మరణించిందని తేలింది. బాధితురాలు ప్రైవేట్ పార్టులో ఒక బుల్లెట్, తొడ భాగంలో రెండవది, వీపులో మూడవ బుల్లెట్ ఉందని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. ఏదేమైనా ఈ ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: