తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటి దాడుల దెబ్బతో తీవ్రంగా కుదేలు అయిపోయారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను మరియు వారి సన్నిహితులను టార్గెట్ చేసి చేసిన దాడుల్లో భారీ మొత్తం దొరికింది.. ఇంకా చంద్రబాబు యొక్క పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ రావు దగ్గర దొరికిన రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల గురించి విషయం బయటకు రాలేదు కానీ అందులో బాబు పాత్ర ఎంత అన్నది తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా విపరీతమైన ఆసక్తి తో ఉన్నారు.

 

ఇకపోతే ఎప్పటినుండో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరియు ప్రజానీకం మధ్య నడుస్తున్న చర్చ ఏమిటంటే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కలిసి పని చేస్తున్నారని.... వారిద్దరూ రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు అని. అయితే పవన్ కళ్యాణ్ విషయాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నా చంద్రబాబు మాత్రం దీని వల్ల తనకే మేలు అన్నట్లు పవన్ పై విపరీతమైన అభిమానం చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషయం పై స్పందిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా కూడా జనసేన అధినేత నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో బాబు తలపట్టుకున్నాడట.

 

ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కనుక టిడిపి నేతలపై జరుగుతున్న ఐటీదాడులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించారు అంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయి అన్న సూచనలను ప్రజలకు చేరవేస్తుంది. అందుకే పవన్ ఎటువంటి తప్పు చేయకుండా దాంతో తనకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి స్పందించకుండా ఉండిపోయాడు.

 

అయితే చంద్రబాబు మాత్రం లో ఇప్పుడు ఒక్కసారిగా పవన్ ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నాడు. నాయుడుకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతనికి ఏదో ఒక వైపు నుండి రాజకీయ అండ అవసరం. అది కేవలం పవన్ కళ్యాణ్ కావడం మరియు అతను కూడా అసలు చంద్రబాబుని పట్టించుకోకుండా తిరుగుతుండడంతో బాబు పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: