తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా కేంద్రంలోని బీజేపీ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన యూనియన్ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వలేదు అనే నెపంతో ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. కేవలం తెలంగాణ ప్రజల మీద ఉన్న ద్వేషం తోనే కేంద్రం విధంగా వ్యవహరిస్తోంది అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు కేసీఆర్. మొన్న జరిగిన మంత్రివర్గ మండలిలో కూడా ఇదే విషయం చర్చకు తీసుకుని వచ్చారు.

 

అయితే నిర్మలా సీతారామన్ మాత్రం ఏమి తక్కువ తినలేదు. కేసీఆర్ చేసిన అన్ని ఆరోపణలకు అనుగుణంగా ఆధారాలతో సహా అతనికి తిరిగి సరైన పద్ధతిలో కౌంటర్ ఇచ్చింది. కెసిఆర్ ఆరోపణలపై నిర్మల ఇచ్చిన వివరణ ఏమిటంటే... 15 ఆర్థిక శాఖ కమిషన్ నిర్ణయించిన ప్రకారం ప్రతి రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగిందని మరియు కేసీఆర్, కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రానికి తామేమి అన్యాయం చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు.

 

గత యూనియన్ బడ్జెట్ తో పోలిస్తే ఈసారి వచ్చిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు సరఫరా చేశామని మరియు గత ఐదేళ్లలో మిగతా రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి వదిలిన బడ్జెట్ మొత్తం చాలా ఎక్కువ అని ఆమె పేర్కొన్నారు. అలాగే 14 ఆర్థిక శాఖ కమిషన్ తో పోలిస్తే దాదాపు 128 శాతం నిధులను ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసినట్లు చెప్పిన ఆమె గతంలో 46 వేల కోట్లు మాత్రమే తెలంగాణకు లభిస్తే ఈసారి మాత్రం ఏకంగా లక్ష కోట్ల రూపాయలు నిధులు సరఫరా చేశామని ఆమె అన్నారు. .

 

ఇలా కెసిఆర్ కావాలనే రాజకీయపరంగా ఆరోపణలు చేస్తున్నారు కానీ దాని వెనక మాత్రం నిజం లేదని నిర్మలాసీతారామన్ ఆధారాలతో సహా వివరించి కేసీఆర్ అబద్ధాలను బట్టబయలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: