ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం అతి వేగం వెరసి ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు నిబంధనలు పాటించండి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులు పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినప్పటికీ.. వాహనదారులు మాత్రం మార్పు రావడంలేదు. ముఖ్యంగా అతివేగం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

 

 

 మొన్నటికి మొన్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై జరిగిన కారు ప్రమాదం నగర ఇంకా  మర్చిపోలేదు. అతి వేగం కారణంగా... బయోడైవర్సిటీ ఫై వెళుతున్న కారు అదుపు తప్పి బయోడైవర్సిటీ పై నుంచి కింద పడింది. కాగా సినిమాను తలపించే రేంజ్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. అతి వేగం కారణంగా బ్రిడ్జిపై నుంచి ఎగిరి చెట్ల నుంచి దూసుకొస్తో అక్కడే ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఇక కారు కూడా తునాతునకలు అయిపోయింది. ఇలాంటి బయో డైవర్సిటీ కారు ప్రమాదం నగరం మరవకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కూడా అతివేగం కారణంగానే జరిగినట్లు తెలుస్తోంది. 

 

 

 వివరాల్లోకి వెళితే.... హైదరాబాద్ లోని కూకట్పల్లి బ్రిడ్జి పై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి నుంచి సనత్నగర్ వస్తుండగా కారు అదుపుతప్పి భరత్ నగర్ బ్రిడ్జిపై నుంచి కింద పడింది. దీంతో సోహెల్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: