ప్రపంచ దేశాల్లో చాలవరకు దేశాలు తమ స్వార్ధం కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్నవే. ఇందుకు ఉదాహరణ, కొన్ని దేశాల్లోని ప్రజలు అనుభవిస్తున్న దుస్దితిని చెప్పవచ్చూ.. ఇక ఇప్పుడు చైనాలో నెలకొన్న వైరస్ మూలంగా, ప్రతిదేశ పౌరులు అంటరాని వారిగా అయ్యారు. ఎక్కడా ఈ వైరస్ వస్తుందో అనే భయం ప్రతి వారిలో సృష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా దగ్గినా, తుమ్మినా వారి వైపు చూసే చూపులు కొంపదీసి ఇతనికి కరోనా వైరస్ సోకిందా అనే సందేహాన్ని రేకెత్తిస్తుంది.. ఈ వైరస్ వల్ల మనశాంతిని కోల్పోయి జీవించవలసిన పరిస్దితులు నెలకొన్నాయి..

 

 

ఇకపోతే అమెరికా చేసేపనులు కొన్ని కొన్ని సందర్బాల్లో చాలా మందికి ఇబ్బందికరంగా మారుతాయి.. ప్రపంచదేశాలకే కాదు, ఆదేశ ప్రజలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి విధి విధానాలకు నిరసనలు తెలిపిన రోజులు ఉన్నాయి.. ఇకపోతే  చైనాలో పుట్టిన కరోనా వైరస్ జపాన్ తీరం వెంబడి లంగరేసిన క్రూయిజ్ షిప్‌లోని ప్రజలను భయపెడుతుంది. ఆ షిప్‌లో ఉన్న కొందరికి ఇప్పటికే ఈ వైరస్ సోకింది. కానీ అమెరికాకు చెందిన 14 మందికి కరోనా వైరస్ సోకలేదని భావించి, వాళ్లను అమెరికాకు తీసుకెళ్లేందుకు విమానంలో ప్రత్యేక ఎర్పాట్లు చేశారు. దానికంటే ముందు ఆ పౌరులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించగా వాళ్లకు వైరస్ ఉందని తేలింది.

 

 

అయితే వైరస్ సోకని ఆయా దేశప్రజలను తమ దేశం తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా, కరోనా సోకిన బాధితులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తమ దేశంలోకి అనుమతించకూడదని అమెరికా ఇప్పటికే తీసుకున్న నిర్ణయం. ఈ క్రమంలోనే క్రూయిజ్ షిప్‌లో వాళ్లకు వైరస్ లేదని నిర్ధారించుకుని వాళ్లను తీసుకుని వెళ్లాలని అనుకుంది. కానీ ఇంతలోనే ఈ వ్యాధి ఉన్న విషయం బయటపడటంతో చేసేదేం లేక వాళ్లను జపాన్ లోని వేరేచోటకు తరలించింది.. ఇకపోతే అమెరికాలో ఇప్పటికే 15మంది కరోనా పేషెంట్లు ఉండగా, వారితో ఈ 14మంది ప్రయాణికులను కలుపుకుంటే ఆ సంఖ్య 29కి చేరుకుంటుందని భావించిన అమెరికా ఈ నిర్ణయం తీసుకుందట.. ఏది ఏమైన కరోనా సోకిన సాటి మనుషుల పట్ల కౄరంగా ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం..

మరింత సమాచారం తెలుసుకోండి: