గడచిన వారం రోజులుగా ఐటి రెయిడ్ల వ్యవహారం ఏపి రాజకీయాల్లో ఎంత సంచలనం రేకెత్తిస్తోందో అందరూ చూస్తున్నదే. ఐటి సోదాల మొత్తానికి చంద్రబాబునాయుడు దగ్గర పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ వ్యవహారమే కేంద్ర బిందువుగా మారింది.  ఐటి అధికారుల పంచనామా రిపోర్టు ప్రకారం శ్రీనివాస్ ఇంట్లో జరిపిన సోదాల్లో ఏమీ దొరకకపోయినా వైసిపి చంద్రబాబుపై బురద చల్లుతోందంటూ ఓ పేపర్ ను పట్టుకుని టిడిపి అధికారపార్టీ నేతలపై ఎదురుదాడి చేస్తున్న విషయం అందరూ చూసిందే.

 

తాజాగా ఐటి శాఖ జారీ చేసిన పంచనామా రిపోర్టు పేరుతో వైసిపి నేతలు విడుదల చేసిన 13 పేజీల నివేదికపై టిడిపి నేతలకు షాక్ కొట్టినట్లయ్యింది. ఎందుకంటే ఐటి శాఖ ఇచ్చిన పంచనామా రిపోర్టు పేరుతో టిడిపి కావాలనే ఒక్క పేజిని మాత్రమే  మీడియాలో చూపుతూ గాలి మాటలు మాట్లాడింది. టిడిపి నేతలకు మొదటి నుండి ఇలాంటి చవకబారు రాజకీయాలు అలవాటే. మొత్తం విషయాన్ని దాచిపెట్టి తమకు అనుకూలంగా ఉండే ఒకటో అరో పేజీలను పట్టుకుని నానా రాద్దాంతం చేస్తుంది. ఆ తర్వాత అసలు విషయం బయటపడగానే మళ్ళీ ఎవరూ అడ్రస్ ఉండరు.

 

ఇపుడు జరుగుతున్నది కూడా ఇదే పద్దతి. పెండ్యాల ఇంట్లో ఐదురోజుల సోదాల తర్వాత  ఐటిశాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్లో రూ. 2 వేల కోట్ల విలువైన అక్రమ లావాదేవీలకు ఆధారాలను గుర్తించినట్లు స్పష్టంగా చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పూణేలో 40 చోట్ల సోదాలు చేసినట్లు కూడా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో సోదాలు జరిపినదంతా టిడిపి నేతలపైనే. ఐటి సోదాలు జరిగిన ఇన్ఫ్రా కంపెనీలన్నీ టిడిడి నేతలవే. మొత్తానికి వైసిపి నేతలపై ఎదురుదాడి చేద్దామని టిడిపి నేతలు చేసిన ప్రయత్నాలను ఒక్కరోజులోనే వైసిపి నేతలు గట్టిగానే తిప్పికొట్ట గలిగారు. దాంతో సమాధానం చెప్పుకోలేక టిడిపి నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: