ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారితే అందులో చంద్రబాబు విధేయులు ఇద్దరు. ఒకరు సిఎం రమేష్, రెండు సుజనా చౌదరి. గరికపాటి మోహనరావు కూడా గాని వాళ్ళు ఇద్దరే ఎక్కువ. ఇక టీజీ వెంకటేష్ ఎంతకు అంతే. సుజనా చౌదరి విషయానికి వస్తే చంద్రబాబుకు ఆర్ధికంగా అండగా ఉన్న నేతే కావడం కాకుండా అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీకి శ్రేయోభిలాషి. బిజెపికి రాజ్యసభ బలం అవసరమని తెలుసుకుని ఆయన్ను బిజెపిలోకి పంపించారు చంద్రబాబు. 

 

పార్టీ ఆఫీస్ కి కరెంట్ బిల్లు కూడా కట్టలేని సమయంలో అండగా నిలబడిన వ్యక్తి. ఇక ఆయన బిజెపిలోకి వెళ్తే చంద్రబాబుకి ఇబ్బంది ఉండదు అనుకున్నారు అంతా. కాని ఏమైందో ఏమో తెలియదు గాని, గత నెల రోజులుగా సుజనా గొంతు మూగబోయింది. రాజధాని విషయంలో కేంద్రం సమయం చూసుకుని మాట్లడుతు౦ది అని చెప్పినా సుజనా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు గత నెల రోజులుగా. రాజధాని తరలింపు విషయంలో కొన్ని జీవోలు కూడా పాస్ అవుతున్నాయి. అయినా సరే సుజనా నుంచి స్పందన ఉండటం లేదు. 

 

ఆయన ఏమీ మాట్లాడటం లేదు కూడా. అసలు ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు కొందరు టీడీపీ నేతలకు. అయితే ఆయన ఇప్పుడు కేసులతో ఇబ్బంది పడుతున్నారని, బ్యాంకులు ఇప్పుడు అవసరం అయితే సుప్రీం కోర్ట్ కి వెళ్ళే అవకాశం ఉంది. దీనితో తనకు సన్నిహితంగా ఉండే కేంద్ర మంత్రులతో ఆయన అటు నుంచి బిజీ గా ఉన్నారట. రాజధాని మారినా తనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని సుజనా భావిస్తున్నారని, తనకు వ్యక్తిగతంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో ఉన్న తన ఆస్తుల మీద జగన్ ఫోకస్ చేసే అవకాశం ఉందని, కాబట్టి ఇప్పుడు రాజధాని విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని భావిస్తున్నారట ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: