కరోనా వైరస్... ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి.  ప్రాణ భయంతో వణికి పోతున్నాయి. ఇక చైనా దేశం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ  ప్రాణాంతకమైన వ్యాధి బారినపడి ఇప్పటికే పదిహేడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. 65 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకి ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇక చైనా లోని  ప్రాణాంతకమైన వైరస్ గుర్తించబడిన హుబి  ప్రావిన్స్ లో  అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. అక్కడ ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకీ కరోనా  వైరస్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. 

 

 

 అయితే ఈ ప్రాణాంతకమైన కరుణ వైరస్ కారణంగా చైనా దేశం మొత్తం దిగ్బంధంలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల నుంచి విమాన సర్వీసులు సహా పలు సర్వీసులను రద్దు చేసుకోవడం.. అంతేకాకుండా ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు స్వీయ దిగ్బంధం చేసుకుంది. ఈ క్రమంలోనే చైనా దేశానికి ఎంతో ఆర్ధిక నష్టం కూడా జరుగుతుంది ఇప్పటికే వివిధ ఉత్పత్తుల కంపెనీలు కూడా మూతపడ్డాయి. అయితే ఎన్నో కంపెనీలు మూతపడడంతో అటు వివిధ దేశాల పై కూడా ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే వచ్చే వేసవి కాలంలో ఈ ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ఎఫెక్టుతో ప్రజలకు కరెంటు కష్టాలు మొదలు కాబోతున్న ట్లు తెలుస్తోంది. 

 

 

 కరోనా  ఎఫెక్టుతో కరెంటు కష్టాలు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు... అయితే వేసవి వచ్చిందంటే అత్యధికంగా విద్యుత్ వినియోగం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీనికిగాను సరికొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే వేసవి కాలానికి తగ్గట్లు సరైన విద్యుత్ పరికరాలు మన దగ్గర లేకపోగా...  చైనా నుంచి మనకు వచ్చే ఉత్పత్తులపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది.  కరోనా  వైరస్ ఎఫెక్టుతో ప్రస్తుతం చైనా నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకోవడం లేదు. ఈ క్రమంలోనే మన దేశంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లతో పాటు కరెంటు పరికరాల కొరత కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ వేసవిలో కరెంటు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: