నగర రహదారులు పెను ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి... రోజు ఎక్కడో ఒకచోట రక్తంతో రహదారులు తడవంది శాంతించడం లేదు.. దీనికంతటికి నిర్లక్ష్యమే కారణం. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, అతి వేగంగా దూసుకెళ్లుతున్న వాహన దారుల చెవిలో కాస్త దూకుడు తగ్గించండని ఎంతగా పోరు పెడుతున్న మార్పు మాత్రం రావడం లేదు.. నిన్న ఎస్సార్ నగర్‌లో రోడ్డుదాటుతున్న యువతిని ఓ కారు ఈడ్చుకెళ్లిన ఘటన, మొన్నటికి మొన్న బయో డైవర్సిటీ కారు ప్రమాద ఘటన ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలను మరువకముందే హైదరాబాద్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది..  

 

 

భరత్‌నగర్ బ్రిడ్జ్‌పై నుంచి వేగంగా వెళ్లుతున్న కారు అదుపుతప్పి ప్రశాంత్ నగర్‌ బ్రిడ్జ్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, స్థానికుల సాయంతో,  సహాయ కార్యక్రమాలు చేపట్టి క్షతగాత్రుల్ని హుటా హుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని సోహెల్‌గా గుర్తించారు. క్షతగాత్రులంతా బోరబండ పండిట్ నెహ్రూ నగర్ కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

 

 

ఇకపోతే కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వెళ్లుతుండగా అదుపు తప్పిన కారు, దాదాపు 30 అడుగుల పైనుంచి కిందపడటంతో నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక అదృష్టం ఏంటంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జి కింద ఎక్కువమంది జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

 

 

ఇకపోతే వాహనదారుల విషయంలో  చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు తరచుగా జరగడం, ప్రజల్లో ఏమాత్రం అవగహన కలగకపోవడం దురదృష్టకరం.. అంతే కాకుండా అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడటం ఎంత దరిద్రమైన విషయం..

మరింత సమాచారం తెలుసుకోండి: