తిరుపతి ఎస్వీ జూనియర్ కాలేజీలో జోరుగా జరుగుతున్న మాస్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ప్రాక్టికల్ పరిక్షకల్లో ఈ మాస్ కాపీయింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కాలేజీలో ఒక కార్పోరేట్ కళాశాల విద్యార్ధులు యధేచ్చగా కాపీయింగ్ కి పాల్పడుతున్నారు. ప్రధానంగా రెండు కాలేజీల విద్యార్ధులు ఈ కాపీయింగ్ కి పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. పరీక్షా హాల్ లోకి పేపర్ లు తీసుకువెళ్ళి మరీ కాపీ కొట్టడం సంచలనం సృష్టించింది.  

 

అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా అక్కడి అధికారుల ముందే జరుగుతుందని అంటున్నారు. మీడియా లో కథనాలు రావడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. మీడియా చూడక ముందు కళ్ళ ముందే చూసి చూడనట్టు వ్యవహారించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. కొంత మంది అధికారులే విద్యార్ధులకు పేపర్ లు ఇస్తున్నారని అంటున్నారు. కొంత మంది విద్యార్ధులు అయితే మరింతగా చెలరేగిపోతున్నారు. ఏకంగా పరీక్ష హాల్ లోకి పేపర్ లు పట్టుకు వెళ్లి ఇన్విజిలేటర్ ముందే కాపీ కొడుతున్నారు వాళ్ళు. 

 

ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఎంపీసి, బైపీసీ, ప్రాక్టికల్ పరిక్షలు మొదలయ్యాయి. ఇక అప్పటి నుంచి కూడా ఇదే విధంగా కాపీ వ్యవహారం జరుగుతుందని మీడియా కు సమాచారం అందింది. దీనికి సంబంధించి మీడియా కొన్ని విజివల్స్ ని కూడా బయటపెట్టింది. పరీక్ష పేపర్లను ముందుగానే అధికారులు లీక్ చేసారని అంటున్నారు. దీనితో విద్యార్ధులు సదరు పేపర్ ని ముందుగానే సమాధానాలు రాసుకుని వచ్చి పరీక్ష హాల్ లో పూర్తి చేస్తున్నారు అని సమాచారం. అయితే దీనిపై చిత్తూరు జిల్లా విద్యాశాఖా అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తుంది. విచారణకు అధికారులు ఆదేశించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే విద్య అంతంత మాత్రం గా ఉంటే ఇలాంటివి ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: