తెలంగాణా మహా కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసి వారం దాటింది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు మేడారం కి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్క తెలంగాణా నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా పలు ఈశాన్య రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో నెల రోజుల పాటు జరిగిన ఈ జాతర ప్రశాంతంగా ముగిసింది. 

 

అయితే ఇప్పుడు అధికారులకు ఒక సమస్య వచ్చి పడింది. ఈ జాతరలో లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు సమ్మక్క సారలమ్మలకు భారీగా కానుకలు సమర్పించారు. మేడారంలో బంగారం గా భావించే బెల్లం తో పాటుగా నగలు, డబ్బులు భారీగా ఇచ్చారు. విరాళాల కోసం 42 కుండీలను అధికారులు ఏర్పాటు చేసారు. వీటిల్లో తమ కానుకలను సమర్పించారు. అయితే ఇప్పుడు వాటి లెక్కింపు అధికారులకు తల నొప్పిగా మారింది. ఆ తర్వాత వర్షం పడటంతో హుండీల్లో కానుకలు తడిచి అతుక్కుపోయాయి. 

 

బంగారానికి ఎక్కువగా రెండు వేలు, 500 నోట్లకు ఎక్కువగా అతుక్కుపోయాయి. ఇప్పుడు ఆ నోట్లను బయటకు తీయడానికి బంగారాన్ని నాన బెడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రమ్ములు ఏర్పాటు చేసారు. అలాగే చిల్లర నాణాల కోసం ప్రత్యేకంగా బకెట్లు ఏర్పాటు చేసి అందులో పోసి కడుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 8 బృందాలను అధికారులు ఏర్పాటు చేసారు. సీసీ కెమెరాల నిఘాలో ఈ నోట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడా కూడా దొంగ తనం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇక బెల్లం కూడా తడిచిపోవడం తో దాన్ని ఎగుమతి చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇక ఈ జాతరలో 20 కోట్ల వరకు కానుకలు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: