భారత్ పాక్ సరిహద్దుల్లో అలజడి రేగింది. పాకిస్తాన్ ఆర్మీ చెలరేగిపోతుంది. వరుసగా మూడు రోజుల నుంచి పాకిస్తాన్ ఆర్మీ వరుసగా కాల్పులకు దిగుతుంది. తేలికపాటి ఆయుధాలు, మోర్టార్ షెల్స్ తో కాల్పులకు దిగుతుంది పాకిస్తాన్ ఆర్మీ. దీనితో భారత బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పాక్ కాల్పులను సమర్ధవంతంగా తిప్పి కొడుతుంది. ఆదివారం అర్ధ రాత్రి కాల్పులకు దిగిన పాకిస్తాన్ మరోసారి సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం కూడా కాల్పులకు దిగింది. 

 

గత ఏడాది కాలంగా వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ వస్తున్న పాకిస్తాన్ ఆర్మీ, సరిహద్దుల్లో అలజడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనితో సరిహద్దు లలో భద్రతను భారీగా పెంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు. నిఘా వర్గాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఏ చిన్న సమాచారం వచ్చినా, జమ్మూ పోలీసులకు, ఆర్మీకి సమాచారం అందిస్తుంది. 

 

గత నాలుగు రోజుల నుంచి కూడా నిఘా వర్గాలకు చెందిన ప్రత్యేక బృందం పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో తిరుగుతూ అక్కడ సమాచారాన్ని సేకరిస్తుంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న యువకుల జాబితాను అధికారులు తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాశ్మీర్ లోయలో ఉన్న దాదాపు 90 మంది యువకులపై ఒక కన్నేసి ఉంచారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈ కాల్పుల్లో పాకిస్తాన్ ఆర్మీ కి చెందిన ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఏ చిన్న సమాచారం వచ్చినా సరే ఆర్మీ వెంటనే అప్రమత్తమవుతుంది. ఇక బ్యాట్ దళాల సంచారం కూడా పెరిగిందని తెలుస్తుంది. దీనితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: