ఏపీలో పార్టీలు, నియోజకవర్గాలు మారి విజయాలు సొంతం చేసుకోవడం ఒక్క గంటా శ్రీనివాసరావుకే సాధ్యమని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గంటా...1999లో అనకాపల్లి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఇక 2004లో చోడవరం టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత టీడీపీకి అధికారం లేకపోవడం, పైగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రావడంతో అందులోకి వెళ్ళిపోయి, 2009లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. నెక్స్ట్ పి‌ఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మంత్రి అయ్యి, కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పరిస్తితి క్లోజ్ కావడంతో మళ్ళీ టీడీపీలోకి వచ్చి 2014లో భీమిలి నుంచి గెలిచి, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు.

 

అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ  విశాఖ ఉత్తరంకు షిఫ్ట్ అయ్యి, ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇక్కడ నుంచే గంటా టీడీపీని వీడుతున్నారని, ఆయన బీజేపీ లేదా వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. నిప్పులేనిదే పొగ రాదు అన్నట్లుగానే గంటా పార్టీ మారే ప్రయత్నాలు చేశారనేది బహిరంగ రహస్యమే. కాకపోతే ఇప్పటికీ ఆయన టీడీపీని వీడలేదు. పైగా టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన కార్యకర్తలకు టీడీపీ కండువా కప్పారు.

 

ఇక ఈ పరిణామాలు చూస్తుంటే గంటా టీడీపీలోనే ఉంటారని అర్ధమైపోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీకు అనుకూల పవనాలు ఉన్నాయని గంటా భావిస్తున్నారు. పైగా వైసీపీ విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని ప్రకటించిన, జిల్లాలో టీడీపీపై వ్యతిరేకిత ఏం లేదని తెలుస్తోంది. ఒకవేళ వ్యతిరేకిత ఉంటే గంటా ఈ పాటికే వైసీపీ లేదా బీజేపీలోకి వెళ్లిపోయేవారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరిల మాదిరిగానే రెబల్ ఎమ్మెల్యేగా కూర్చునేవారు.

 

అలా చేయకుండా టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే, గంటాకు అసలు పరిస్థితి పూర్తిగా అర్ధమైందనే అనుకోవచ్చు. మూడు రాజధానులు ప్రకటించినప్పుడు టీడీపీపై వచ్చిన కాస్త వ్యతిరేకిత, ఇప్పుడు వైజాగ్ ప్రజల్లో లేదని, చాలా మార్పు వచ్చిందని తెలుస్తోంది. ఈ మార్పు తెలిసి గంటా టీడీపీలో ఉండటానికి ఫిక్స్ అయిపోయారని ఆ పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: