ప్రస్తుతం ఎక్కడ చుసిన కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయన్న సంగతి తెలిసిందే.. కాగా ఇప్పడు మాహారాష్ట్ర లో జరిగిన ఓ ఘటన కలకలం సృష్టిస్తుంది. రక్షణ కల్పించాల్సిన హాస్టల్ వార్డెన్ వికృత వీడియోలు చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రోజు రోజు కు అతని ఆగడాలు ముదరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

 


సతారా జిల్లాలో ని పంచగని ప్రాంతాని కి చెందిన ప్రభుత్వ హాస్టల్‌ ఉంటున్న గిరిజన బాలికలపై కన్నేసిన వార్డెన్ వారిని తరుచూ లైంగికంగా వేధిస్తున్నాడు10-13 మధ్య వయసున్న 11 మంది బాలికలు హాస్టల్‌ నుంచి పరారయ్యారు. వీరిని గమనించి స్థానికులు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. బాలికలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి అనేక వివరాలు రాబట్టారు. 

 

 

తమను వార్డెన్ తరుచూ గదిలో కి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఫోన్లో సెక్స్ వీడియోలు చూపించి అలా చేయాలంటూ వేధిస్తున్నాడ ని బాలికలు చెప్పారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికులు కలిసి ఆ ప్రబుద్దుడికి దేహశుద్దీ చేశారు.  బాలికలు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళ తల్లి దండ్రులకు సమాచారం అందించారు. 

 


ఈ విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని వార్డెన్‌ను నిలదీశారు. వారి ఫిర్యాదు తో పంచగని పోలీసులు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికలపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదని, వైద్యులు పరీక్ష చేయించి అనంతరం రిపోర్టులు వచ్చాకే ఫోక్స్ కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రక్షణలో ఉంటారని బాలికలను హాస్టల్లో ఉంచితే అతను చేస్తాడా అంటూ బాలికల తల్లి దండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు సద్దిచెప్పాడంతో ఆందోళన విరమించుకున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: