ఆంధ్రప్రదేశ్ లో అవినీతి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. అవినీతి అధికారులు ఉండకూడదు అని భావించిన జగన్, ఇటీవల ఏసీబీ నూతన డీజీగా సీనియర్ ఆఫీసర్ సీతారామాంజనేయులు ని నియమించారు. ఇక ఆయన జగన్ మద్దతు ఉండటంతో ఎప్పుడు ఏ కార్యాలయం మీద దాడి చేస్తున్నారో దాడి చేసే అధికారులకు కూడా స్పష్టత రావడం లేదు. నేరుగా ఆయన పర్యవేక్షించడం తో అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్ని శాఖలను వరుసగా టార్గెట్ చేస్తున్నారు అధికారులు. 

 

తడ నుంచి ఇచ్చాపురం వరకు కూడా అధికారులు చేస్తున్న దాడులు ఇప్పుడు కొందరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న అధికారులు ఇప్పుడు ఏసీబీ అధికారుల దాడులకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు అధికారులు మున్సిపల్ శాఖను టార్గెట్ చేసారు. మున్సిపల్ ఆఫీసులను టార్గెట్ చేసిన ఏసీబీ ఏక కాలంలో దాడులకు దిగింది. కడప ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ లో తొలుత దాడులు చేసారు. 

 

ఇక అక్కడి నుంచి తిరుపతి మున్సిపల్ ఆఫీస్, గుంటూరు మున్సిపాల్ ఆఫీస్, విశాఖ జీవిఎంసి ఆఫీస్, మధురువాడ లో ఎసీబీ దాడులు చేసారు. ఆ తర్వాత విజయనగరం లో ఏసీబీ దాడులు చేసింది. ఏకకాలంలో వరుస ఫిర్యాదులతో అధికారులు దూకుడుగా దాడులు చేస్తున్నారు. దీనితో ఒక్కసారిగా అధికారులలో కలవరం మొదలైంది. ఇక ఇదే రోజు మరిన్ని కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో చాలా మంది అధికారులు విధులకు కూడా హాజరు కావడం లేదని సమాచారం. చిన్న ఫిర్యాదు వచ్చినా సరే అధికారులు వాలిపోతున్నారు. వెంటనే సోదాలు చేస్తున్నారు. ఎమ్మార్వో, వీఆర్వో ఆఫీసులతో పాటు అవినీతి తిమింగలాలను టార్గెట్ చేస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: