ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో మూడో దశ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్య రంగంలో చేసే మార్పుల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. మూడో దశ కంటి వెలుగు కార్యక్రమాలని నేటి నుంచి ప్రారంభిస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రులను కార్పోరేట్ ఆస్పత్రులకు తీసిపోకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆస్పత్రుల అభివృద్దికి 15,335 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. 

 

నాడు నేడు కార్యక్రమంలో మార్పు మూడేళ్ళలో చూడవచ్చు అన్నారు. ఆస్పత్రుల రూపు రేఖలను మార్చడానికి నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మార్చ్ 1 నుంచి అవ్వా తాతలకు ఉచితంగా, ఆపరేషన్లు, కంటి పరిక్షలు చేయిస్తామని, కళ్ళ జోళ్ళు ఎవరికి అయితే అవసరమవుతాయో వారికి ఉచితంగా గ్రామ వాలంటీర్ వచ్చి, మీ ఇంటి వద్దకే వచ్చి ప్రతీ అవ్వా తాతా చేతిలో పెడతాడని హామీ ఇస్తున్నామని అన్నారు. అందిస్తామని అన్నారు. రూ, 700 కోట్లతో ఏరియల్ ఆస్పత్రుల ఆధునీకరణ చేస్తామని అన్నారు జగన్. 

 

జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసారు జగన్. ఒకటి తారీఖు నుంచి ప్రారంభం అయ్యే కంటి ఆపరేషన్లను 133 కేంద్రాల్లో చేస్తామని అన్నారు జగన్. 11 మెడికల్ టీచింగ్ ఆస్పత్రులలో, 13 జిల్లా ఆస్పత్రులలోనూ 28 ఏరియా ఆస్పత్రులలోనూ 81 ఎన్జీవో లతో కూడిన కంత్రి ఆస్పత్రులలో ఈ ఆపరేషన్లు జరుగుతాయని జగన్ హామీ ఇచ్చారు. దీనికి ప్రభుత్వం అన్ని సన్నాహకాలు చేసిందని జగన్ ప్రకటించారు. మొదటి దశలో రూ 1129 కోట్లతో నాడు నేడు కార్యక్రమం జరుగుతుంది అన్నారు జగన్. రెండో దశలో పీహెచ్, కమ్యునిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అవ్వాతాతలకు ఎం చేసినా తక్కువే అన్నారు జగన్. ఈ కార్యక్రమానికి 560 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని ఒక మనువడిగా గర్వపడుతున్నా వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: