తెలంగాణా ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. పీఆర్సీ (వేతన సవరణ ) గడువుని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సి కోసం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పించన్ దారులు ఈ నివేదిక కోసం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఇప్పటి వరకు ఎదురు చూసారు. ప్రభుత్వం ఉత్తర్వులతో వారు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరులోగా నివేదిక అందించాలి అని ప్రభుత్వం పీఆర్సీని ఆదేశించింది. 

 

దానికి ఈ నెల 24తో గడువు పూర్తి కానున్న తరుణంలో కెసిఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన గడువులో గా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తులు కూడా పూర్తి చేసింది. మార్చ్ లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ లోపే నివేదిక ఇస్తే దాన్ని అధ్యయనం చేసి మంత్రి వర్గ ఆమోద ముద్ర లభించాలి. వేతన సవరణ విషయంలో మూడు శ్లాబులను నివేదించే అంశాన్ని పీఆర్సీ పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఏడాదిన్నర నుంచి వేతనాలపై పెంపు విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. 

 

2018 ఆగస్ట్ లో వేతనాల పెంపు విషయంలో కెసిఆర్ ప్రకటన చేసినా ఇప్పటి వరకు అవి అమలు కాలేదు. గత ఏడాది నవంబరు 10 వ తేదీన తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి... 10-12 రోజుల్లో పీఆర్సి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. అయినా ఆ నివేదిక ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇటీవల కెసిఆర్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు, ఉద్యోగులకు ఎంతో కొంత వేతన సవరణ చేస్తామని ప్రకటించినా పీఆర్సి నివేదిక మాత్రం రాలేదు. 3.80 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పెన్షన్ అందుకునే వాళ్ళు 2.5 లక్షల మందికి పైగా ఉన్నారు. దీనిపై ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: