తెలంగాణ సీఎం కెసిఆర్ రాజకీయ వ్యూహాలు.. రాజకీయ ఎత్తుగడలు ఎవరికీ అర్థం కావు. కేసీఆర్ ఏం చేసినా... ఎలాంటి వ్యూహం ప‌న్నినా దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. కెసిఆర్ రాజకీయ ప్రత్యర్థులు ఆయ‌న ఎత్తుల‌కు ఎలా చిత్తు అవుతారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా సీఎం కేసీఆర్ తనకు ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌పై ఎక్కువగా ఫోకన్ చేయడానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉందేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

 

కెసిఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఎక్కువగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పై ఎక్కువుగా దృష్టి పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. నెలల వ్యవధిలోనే కరీంనగర్ లో ఆయ‌న త‌ర‌చూ ఎందుకు ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డ ఎందుకు ఇంత బాగా  ఫోక‌స్ పెడుతున్నారో ఎవరికి అర్థం కాలేదు. అయితే దీని వెనక కెసిఆర్ వేసిన బిగ్‌ స్కెచ్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

త్వరలోనే తన సీఎం పదవిని తనయుడు కేటీఆర్‌కు అప్పగించాలనే యోచనలో ఉన్న కేసీఆర్... ఆ తరువాత జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఇక త‌న జీవితంలో చివ‌రి ద‌శ‌లో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న కోరిక‌తో ఉన్న కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి పోటీ చేయాల‌ని ప్లాన్ వేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం అక్క‌డ బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ ఉన్నారు.

 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను క‌రీంన‌గ‌ర్ నుంచి పోటీ చేసి ఉత్త‌ర తెలంగాణ‌లో బీజేపీకి చెక్ పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. మొత్తానికి అచ్చొచ్చిన కరీంనగర్‌పై కేసీఆర్ ఫోకస్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే టైంలో తెలంగాణ‌లో ఎద‌గాల‌నుకుంటోన్న బీజేపీకి పూర్తిగా చెక్ పెట్టి.. మ‌ళ్లీ ఉత్త‌ర తెలంగాణ‌ను కారు పార్టీకి కంచుకోట‌గా మార్చాల‌ని కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: