ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. ముగ్గురు యువతులు అదృశ్యం కావడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. యువతుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు నిన్న ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతులు తల్లి మొబైల్ కు తాము చనిపోతున్నామని తమ కోసం వెతకవద్దని సందేశం పంపించారు. 
 
యువతులు చనిపోతున్నామని మెసేజ్ పంపించడంతో వారి తల్లిదండ్రులు మరింత ఆందోళన పడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు యువతుల ఫోటోలను పంపి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ముగ్గురు యువతులు ఇంటినుండి అదృశ్యం కావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే విశాఖ ద్వారకానగర్ లో నివశించే ఎర్రన్నాయుడు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 17 సంవత్సరాలు వయస్సు గల ముగ్గురు యువతులు తల్లికి తాము చనిపోతున్నామని ఒక మెసేజ్ ను పంపి ఇంటినుండి నిన్న సాయంత్రం అదృశ్యమయ్యారు. ఇప్పటివరకు యువతులకు సంబంధించిన ఎటువంటి సమాచారం తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. 
 
యువతులు ఇంటినుండి వెళ్ళిపోవటానికి కారణాలు తెలియటం లేదు. పోలీసులు టెక్నాలజీ సహాయంతో యువతుల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ చుట్టుపక్కల గల సూసైడ్ స్పాట్స్ దగ్గర కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు యువతుల ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలు అదృశ్యమైన యువతుల కోసం గాలిస్తున్నాయి. యువతులు వారంతట వారే ఇంట్లో నుండి వెళ్లారా...? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా...? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువతులు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: