ఆడపిల్ల బయట కాలు పెడితే చాలు కామాంధులు కోరల్లో  చిక్కుకోవాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సృష్టికి మూల కారణమైన మహిళ నిరంతరం ప్రశ్నార్థక జీవితాన్ని గడుపుతుంది. నేటి సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చదువు ఉద్యోగం ఎక్కడికి వెళ్ళినా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక సొంత ఇంటిలో కూడా మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు.మహిళలపై లైంగికంగా వేధించే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై అత్యాచారాలు చేసేందుకు భయపడడం లేదు. 

 

 

 తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కామంతో రగిలిపోయిన ఫోటోగ్రాఫర్ తన వద్దకు ఫోటో తీయించుకుని ముందుకు వచ్చినా మైనర్ బాలికపై లైంగిక దాడికి దిగడంతో చాకచక్యంగా తప్పించుకున్న బాలిక  సమాచారం అందించడంతో అతనికి దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే... నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైనిక్పురి లో సలీం అనే వ్యక్తి ఆర్ఎస్ డిజిటల్ ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నారు. కాగా  మంగళవారం అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక ఫోటో తీయించుకునేందుకు స్టూడియోకి వెల్లింది. స్టూడియోలు ఎవరూ లేకపోవడంతో మైనర్ బాలికపై లైంగిక దాడికి దిగాడు ఫోటోగ్రాఫర్. 

 

 

 ఫోటోగ్రాఫర్ తీరుతో కంగారు పడిపోయిన బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది.  స్థానికులు ఏం జరిగిందని ఆరాతీస్తే  స్థానికులకు బాలిక జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో  ఫోటోగ్రాఫర్స్ సలీమ్ ని  చితకబాదారు స్థానికులు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. స్థానికుల దాడితో  తీవ్రంగా గాయపడిన సలీమ్ ని  హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. సలీమ్ కి  కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: