ఏప్రిల్ నెల వచ్చేస్తోందంటేనే అమెరికాలో ఉన్న  తెలుగు వాళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది.  టెన్షన్ కు కారణం ఏమిటంటే హెచ్ 1 బి వీసాకు గడువు అయిపోతుందటమో లేకపోతే వస్తుందో రాదో అన్న అనుమానమే. ప్రతి ఏడాది ఏప్రిల్ లో హెచ్ 1 బి వీసాను అమెరికా ప్రభుత్వం కేటాయిస్తుందట. దరఖాస్తు చేసుకునే వాళ్ళను బట్టి ఎన్ని వీసాలు మంజూరు చేయాలనే నిర్ణయాన్ని బట్టి ఎంతమందికి వీసాలు మంజూరు చేస్తారనేది ఆధార పడుంటుంది. వీసాల మంజూరు కూడా లాటరీ పద్దతిలోనే ఉండటంతో అందరి భవిష్యత్తు ఇపుడు గాలిలో దీపంలాగ తయారైంది.

 

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి తిరిగి రావటానికి ఎవరూ ఇష్టపడరన్న విషయం అందరికీ తెలిసిందే.  అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న వాళ్ళు ఏమి చేస్తారంటే అక్కడే ఉద్యోగాలు వెతుక్కుంటారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపిటి) అర్హతతో ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్లు సుమారు 68 వేలమంది ఉంటారు. వీళ్ళల్లో సుమారుగా 24 వేలమంది తెలుగు వాళ్ళే ఉన్నారు. అందుకనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్ధులతో పాటు వాళ్ళ కుటుంబాల్లో  విపరీతమైన టెన్షన్ పెరిగిపోతోంది.

 

ప్రతి ఒక్కరు ఓపిటి కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు రెజెక్ట్ అయ్యుంటే రాబోయే ఏప్రిల్ నెలలో జారీ చేసే హెచ్ 1 బి వీసా చివరిదవుతుంది. అప్పుడు కూడా రాకపోతే మూటాముల్లె సర్దుకుని తిరిగి వచ్చేయాల్సిందే.  ఒకవేళ అలా రావటానికి ఇష్టపడని వాళ్ళు మళ్ళీ ఏదైనా కోర్సుల్లో చేరి చదువుకోవటమో లేకపోతే ఏదైనా సబ్జెక్టుల్లో పిహెచ్ డి కోసం చేరటమో చేయాలి. అదీ లేకపోతే హెచ్ 1 బి వీసా ఉన్న వాళ్ళనో లేకపోతే గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవటమే మిగిలిన మార్గం. సరే ఎవరి అదృష్టం ఎలాగుందో తెలియాలంటే ఏప్రిల్ నెల వరకూ వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: