ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు. తాజాగా చంద్రబాబు టీడీపీ నేతలతో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టులో ఏపీ సీఎం జగన్ ఉపాధి హామీ నిధుల మళ్లింపు విషయంలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని మిస్లీనియస్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని విమర్శలు చేశారు. 
 
సీఎం జగన్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని జాతీయ ఉపాధీ హామీ పథకాన్ని కూడా నిర్వీర్వ్యం చేసే విధంగా జగన్ పాలన ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు 2500 కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను దారి మళ్లించిందని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, కూన రవికుమార్ మీడియాతో మాట్లాడారు. 
 
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉపాధి హామీ బిల్లులను చెల్లించకపోవడం వలన అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొందరికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచనలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కొరకు కృషి చేయాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. 
 
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తోందని పంచాయతీలను ప్రభుత్వం బలహీనపరుస్తోందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం ధిక్కరిస్తోందని అన్నారు. టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆ పనులకు సంబంధించిన నిధులను కేంద్రం రాష్ట్రానికి పంపినప్పటికీ రాష్ట్రం ఆ నిధులను దారి మళ్లించిందని టీడీపీ నేతలు చెప్పారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందో లేదో చూడాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: