దేశంలో రోజురోజుకీ ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి ఘటనలు రోజుకొకటి దేశంలో ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణం దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ అని చాలామంది అంటున్నారు. మేటర్ లోకి వెళ్తే నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్ష మూడోసారి కూడా పడుతుందో లేదో అన్న సందేహాలు ఇప్పుడు అందరికీ నెలకొన్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడటంతో మూడో సారైనా ఉరిశిక్ష అమలవుతుందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ కేసులో నలుగురు దోషులకు ఒకేసారి శిక్ష విధించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం మనకందరికీ తెలిసినదే.

 

గతంలో రెండుసార్లు దోషులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వివిధ చట్టాలను అడ్డంపెట్టుకుని కొత్త కొత్త పిటిషన్ల తో ఉరిశిక్ష వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి గత నెల 22వ తేదీన నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉంది. కాగా నలుగురు దోషులకు ఒకరైన ముఖేశ్ క్ష‌మాభిక్ష పిటిష‌న్ వేయ‌డంతో...మృత్యువు ఫిబ్ర‌వ‌రి 1కి వాయిదా ప‌డింది. అయితే ఆ తర్వాత 31న దోషులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో చ‌ట్ట ప‌రిధిలోని అన్ని అంశాల‌ను వినియోగించుకునే వ‌ర‌కు ఉరి వాయిదా వేయాల‌ని కోర్టు పేర్కొంది.  ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని తేల్చి చెప్పింది.

 

ఇటువంటి నేపథ్యంలో మళ్లీ మూడోసారి ఉరిశిక్ష కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో దోషులను న్యాయస్థానాలే మరియు చట్టాలే కాపాడుతున్నాయి అన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి న్యాయ వ్యవస్థల వల్ల ఆడ జాతిని మనమే దేశంలో లేకుండా చేస్తున్నామని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇది ఈ దేశానికి, దేశ ప్రజలకే పెను సవాల్ .. నిర్భయ ఆత్మ ఘోషిస్తోంది త్వరగా ఆ దోషులకు ఉరి తీయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: