పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు వైసీపీ పార్టీలో మరియు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఐటి దాడుల సోదాల్లో చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ చౌదరి దగ్గర దొరికిన రెండు వేల కోట్ల గురించి మాట్లాడిన జోగి రమేష్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వాడిన పదజాలం పట్ల సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమా ఇంకొంత మంది నాయకులను ఉద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ ఎదవలు పిచ్చి కుక్కలు ఎలా పడితే అలాగా మీడియా ముందు మాట్లాడే వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు అనే విమర్శలు చేశారు.

 

ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ...పీకే అంటే అందరికి పవన్ కళ్యాణ్ కావచ్చు అని, కానీ నాకు మాత్రం తాజాగా పీకే అంటే పిచ్చికుక్క అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఇంకా అనేకమైన విమర్శలు చేశారు ఎమ్మెల్యే జోగి రమేష్. దీంతో వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది బహిరంగంగా మీడియా ముందు అధికార పార్టీకి చెందిన నేతలు ఇలా మాట్లాడటం సమంజసం కాదని రమేష్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం చెందారు.

 

మేటర్ ఉన్న కొద్ది సీరియస్ అవుతున్న తరుణంలో వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి...జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు పర్సనల్ గా ఆయనకి ఫోన్ చేసి గట్టిగా క్లాస్ తీసుకున్నారట. ఏంటయ్యా ఆ మాటలు నువ్వు ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వి మీడియా ముందు అంత దారుణంగా " కుక్కల రాజకీయం ఏంటయ్యా " కాస్త విమర్శలు తగ్గించు అంటూ క్లాస్ తీసుకున్నారు అని వైసీపీ పార్టీలో వినబడుతున్న టాక్.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: