ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రూటు మార్చారు. ఇన్నాళ్ళు తనకు పెద్ద పీట వేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి బిగ్ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం పర్యటన చెయ్యాలని ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయ౦ తీసుకున్నారు. బీహార్ లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆయన రాష్ట్రం మొత్తం పర్యటన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా ఆయన పర్యటనలు చేయనున్నారు. దీనితో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. 

 

ఇన్నాళ్ళు కేవల౦ ఎన్నికల వ్యూహకర్తగానే పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రూటు మార్చడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ప్రశాంత్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటీ అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ప్రశాంత్ క్రిశోర్ తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. ‘‘బాత్ బీహార్ కీ’’ పేరుతో రాష్ట్రం మొత్తం పర్యటనలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... తాను ఎక్కడికి వెళ్ళబోవడం లేదన్నారు. బీహార్ కోసం పని చేసేందుకు అంకితము  అవుతాను  అన్నారు. 

 

బీహార్‌లో జరిగిన అభివృద్ధి ఎంతో చూసేందుకు, నూతన బీహార్‌ను నిర్మించేందుకు ‘బాత్ బీహార్ కీ ’ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నా అంటూ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధిలో అట్టడుగున ఉండే బీహార్ కాకుండా సరికొత్త బీహార్‌ను కోరుకునే వాళ్లందర్నీ ఆయన ఆహ్వానించారు. అభివృద్ధిలో ప్రస్తుతమున్న 22వ స్థానం నుంచి 10వ స్థానానికి చేరేలా బీహార్ అభివృద్ధి చెందడం చూడాలను కుంటున్నానన్నారు. టాప్ టెన్ రాష్ట్రాల్లో బీహార్‌ను నిలపాలనుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించారు. ఈ నెల 20 నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. దీనితో ఒక్కసారిగా బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. కాగా ప్రశాంత్ ని జేడియు నుంచి నితీష్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: