ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు కరోనా వైరస్. చైనా దేశంలో బీభత్సం విజృంభిస్తుంది ఈ వైరస్. మనిషి నుండి మనిషికి అంటువ్యాధుల సోకే ఈ వైరస్ కి చైనా దేశంలో ఇప్పటికే చాలామంది బలైపోయారు. దీంతో చైనా దేశం కరోనా వైరస్ ని అరికట్టడానికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రాకపోకలు ఆపేసింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రతి ప్రాంతాన్ని కస్టడీలోకి తీసుకుంది. ఎవరైనా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే కంపల్సరిగా వైద్య పరీక్షలు ఆ యొక్క ప్రాంతం బోర్డర్ లో జరిపించుకుని వెళ్లాల్సిందే. ఇదే తరుణంలో ప్రపంచ దేశాలు కూడా చైనా దేశానికి విమాన రాకపోకలు ఆపేయటం జరిగింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ లక్షణాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో చైనా దేశంలో బిగ్ బ్రేకింగ్ లాంటి న్యూస్ ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే గతంలో ఈ వ్యాధిగ్రస్తుల గురించి వెయ్యి పడకల ఆసుపత్రిని రెండు రోజుల్లో నిర్మించడం జరిగింది. తాజాగా మరో ఘనతను సాధించడానికి చైనా రెడీ అయ్యింది. విషయంలోకి వెళితే కేవలం ఆరు రోజుల వ్యవధిలో బీజింగ్ ఓ ఫ్యాక్టరీని నిర్మించాలని నిశ్చయించింది.

 

రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూ ఉండటం, చాలినన్ని మాస్కులను సరఫరా చేయలేకపోతూ ఉండటంతో, రోజుకు 2.50 లక్షల మాస్క్ లను తయారు చేసేలా ఈ ఫ్యాక్టరీని నిర్మించాలని చైనా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీంతో ఇటీవల ఫ్యాక్టరీ నిర్మాణం పనులు ప్రారంభించింది. ఆదివారం లోపు ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి వెంటనే ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో చైనా అధికారులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను చాలా తెలివిగా షిఫ్టులు వారీగా 24 గంటలు పని జరిగేలా ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: