తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ ఎన్నో అభివృద్ది పనులు చేశారు.  ఆయన అభివృద్ది మంత్రానికి ప్రజలు మరోసారి పట్టం కట్టారు.  గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కి అఖండ విజయాన్ని కట్టబెట్టారు.  అంతే కాదు అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి టీఆర్ఎస్ విజయం పథంలో ముందుకు సాగుతుంది.  మొన్నటి మున్సిపల్  ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ ఘన విజయం అందుకుంది.  తాజాగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ... తెలంగాణ పట్టణాలను ఆదర్శంగా మార్చాల్సిన బాధ్యత మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని సీఎం కేసీఆర్ ఉద్బోధించారు.   జాతీయ రాజకీయాల్లో చక్రం తప్పాలని భావిస్తే... ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుంది.

 

ఇందుకోసం కేసీఆర్ తనకు ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌ను ఎంపిక చేసుకున్నారని... రాబోయే ఎన్నికల నాటికి కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు మనల్ని ఎన్నుకుంటున్నారంటే.. ఎంతో నమ్మం మనపై ఉంచినట్టే అని ప్రతి ఒక్కరూ భావించాలి.  మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయం సాధించాలి అని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.  అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదని, లేని గొప్పదనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దని హితవు పలికారు. 

 

ఎవరు ఎక్కడ పొగరుగా వ్యవహరించినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారందరినీ ప్రజలు గుర్తుకు పెట్టుకుంటారు.. సమయం వచ్చినప్పుడు తిప్పి కొడతారని హితవు పలికారు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని, దీన్ని ఒక సోపానంగా భావించి సానుకూలంగా భావించగలిగితే ప్రజాజీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చని, అది మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది మనల్ని మనం సరిగ్గా పాలించుకోవడానికే అని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: