ప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే సినిమాలు చూసేవారు... లేదంటే బయటికెళ్లి మైదానంలో ఏదైనా ఆడుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాలంటే కేవలం స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఎంతో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. 24 గంటలు చూసినా బోర్ కొట్టని ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో దొరుకుతుంది. ఇక స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు కొంగొత్తగా  ఆలోచిస్తూ ఎన్నో ఎంటర్టైన్మెంట్ యాప్స్  కూడా తెర మీదికి వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చింది టిక్ టాక్. ప్రస్తుతం నెటిజన్లు అందరు టిక్ టాప్ ను బాగా ఉపయోగిస్తున్నారు... కాదు కాదు బానిసలుగా మారిపోయారు. 

 

 ఏకంగా మాయదారి పబ్జి గేమ్ ని సైతం మైమరిపించే లాగా ఎంతోమందిని ప్రభావితం చేసింది ఈ టిక్ టాక్. అంతకు మునుపు ఇలాంటి యాప్ ఏదీ లేకపోవడంతో ... ఇతరులు చేసిన వీడియోలు కూడా ఇందులో చూడటానికి  ఉండడంతో ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ లేకుండా పోయింది. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ టిక్ టాక్  లో మునిగి తేలుతున్నారు. కొందరు వీడియోలు చేసి లైక్స్ వస్తే సంతోషపడే వాళ్ళు అయితే... కొంతమంది ఇతరులు చేసిన వీడియోలను చూసి సంతోష పడతారు. ఏదైతేనేం రోజంతా టిక్టాక్లో గడిపేస్తున్నారు జనాలు . 

 

 కొంతమంది లైక్ ల కోసం ఏకంగా  ప్రాణాలనే రిస్క్ లో పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. టిక్ టాక్ మాయలో పడి చాలా రిస్కీ స్టంట్స్ చేస్తూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు చాలామంది. తాజాగా ఇలాంటి వీడియోనే రైల్వేశాఖ ట్వీట్ చేసింది. ఓ యువకుడు లైకుల కోసం పెద్ద రిస్క్ చేసి  ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. యువకుడు వేగంగా వెళ్తున్న ట్రైన్ లో  నుంచి దిగి  తిరిగి మళ్ళీ ఎక్కే ప్రయత్నం చేయకపోగా..  ట్రైన్ వేగంగా  ఉండటంతో కిందపడిపోయాడు. ఇక అంతలోనే ట్రైన్ కింద పడి  చనిపోయాడు అనుకునే లోపు క్షణాలు పక్కకు దొర్లాడు. దీంతో తృటిలో  ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టిక్ టాక్ మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకునే పనులు చేయకండి అంటూ రైల్వేశాఖ ట్వీట్ చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: