అన్నీ బావున్నప్పుడు ఆరోగ్యం విలువ ఎవరికీ తెలియదు.. కానీ.. ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు.. అనూహ్యంగా రోగాలు వచ్చినప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది. అయితే కొన్ని జబ్బులు స్వయంకృతాల వల్ల వస్తే.. మరికొన్ని మనకు తెలియకుండానే మన శరీరంలో చొరబడతాయి. జీవితాన్ని విషాదమయం చేస్తాయి.

 

అయితే ఇప్పుడు ఏపీలో రోగులకు కాస్త ఊరట లభిస్తోంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య, ఆరోగ్య, విద్య రంగాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రత్యేకించి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టే ఆరోగ్య శ్రీ పథకంలోకి అనేక కొత్త రోగాలు చేర్చారు. ఎందరో అభాగ్యులకు వైద్య సౌకర్యం కల్పించారు.

 

ఇటీవల వైద్యం పరంగానూ జగన్ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. వైద్యం పరంగా రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. పాఠశాలల తరహాలో ఆస్పత్రుల్లోనూ నాడు – నేడు పథకం అమలు చేయబోతున్నారు. సబ్‌ సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డుల జారీ వంటి విషయాల్లోనూ జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు.

 

అంతేకాదు.. రాష్ట్రాన్ని వైద్యపరంగా కర్నూలు –కడప –అనంతపురం, ప్రకాశం –నెల్లూరు – చిత్తూరు, కృష్ణా –గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జోన్లవారీగా విభజించారు. ఈ జోన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ మూడు మెడికల్‌ యూనివర్శిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఆయా జోన్ల పరిధిలోని మెడికల్ కాలేజీల్లో సూపర్‌స్పెషాల్టీ కోర్సులు పెట్టబోతున్నారు.

 

ఆసుపత్రల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీపైనా జగన్ దృష్టి సారించారు. ఈ ఏడాది మే నెల నాటికి వైద్యారోగ్యశాఖలో సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోవాలని జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. ఏప్రిల్‌ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌ఓ, గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీకి చేయాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: