జగన్మోహన్ రెడ్డికి సోదరి వైఎస్ షర్మిల కొత్తగా తలనొప్పిగా మారినట్లు పార్టీ నేతలను బట్టి అర్ధమవుతోంది. మరి కొద్ది రోజుల్లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. ఎంఎల్ఏల సంఖ్యాబలం రీత్యా ఖాళీ అయ్యే నాలుగూ వైసిపికే దక్కబోతున్నాయి. ఇక్కడే జగన్ కు సమస్యలు మొదలైనట్లు తెలుస్తోంది. భర్తీ చేయాల్సిన నాలుగు స్ధానాల్లో ఒకదానికి షర్మిలకు కేటాయించాలంటూ పార్టీ నేతలు జగన్ కు సూచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

పార్టీ వ్యవహారాల్లో జగన్-షర్మిల మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో బయటకు వాళ్ళెవరికీ తెలీదు. కానీ ఎప్పుడు సందర్భం వచ్చినా ముందుగా షర్మిల పేరు ప్రచారంలోకి వస్తోంది.  మొన్నటి ఎన్నికల్లోనే షర్మిల విశాఖపట్నం ఎంపిగా పోటి చేస్తుందనే ప్రచారం అందరికీ తెలిసిందే.  తర్వాత విశాఖ కాదు ఒంగోలన్నారు. ఆ తర్వాత గుంటూరు అని చెప్పారు. అసలు జగన్ మనసులో ఏముందో తెలీదు. పోటి చేసే విషయంలో షర్మిల ఏమనుకుంటోందో కూడా ఎవరికీ తెలీదు. అన్నా చెల్లెళ్ళు నోరివిప్పక పోయినా నేతలు మాత్రం ఊరుకోవటం లేదు.

 

తాజాగా రాజ్యసభ స్ధానాల భర్తీ విషయంలో మరోసారి షర్మిల పేరు ప్రచారంలోకి వచ్చింది. పార్టీ పెట్టినప్పటి నుండి షర్మిల అందిస్తున్న సేవలను గుర్తించి జగన్ వెంటనే రాజ్యసభ ఎంపిగా నామినేట్ చేస్తే బాగుంటుందని కోరుకునే నేతల సంఖ్య పెరిగిపోతోంది. ఎవరికి వారుగా కోరుకోవటమే కాకుండా కొందరైతే ఏకంగా జగన్ దగ్గరే ప్రస్తావిస్తున్నారట.

 

అయితే కొందరు నేతలు చెబుతున్నదాని ప్రకారమైతే షర్మిలకు జగన్ ఎటువంటి పదవీ ఇచ్చే అవకాశం లేదట. ఎందుకంటే చెల్లెలుకు ఏదైనా పదవంటూ ఇస్తే పార్టీలో షర్మిల మరో పవర్ సెంటర్ అయ్యే అవకాశం ఉందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తనంతట తానుగా మరో పవర్ సెంటర్ ను కొనితెచ్చుకోవటం ఎందుకన్న ఉద్దేశ్యంతోనే  షర్మిలను అవసరానికి మాత్రమే వాడుకుని తర్వాత దూరంగా పెడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి షర్మిల అభిమానులకు నిరాస తప్పేట్లు లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: