నేటి సమాజంలో మహిళల్ని ఏ రంగంలోనూ గౌరవించే సంస్కారం ఇసుమంతయినా కనిపించడం లేదు. స్త్రీలను తక్కువగా, నీచంగా, వాడుకోదగిన వస్తువులుగా మాత్రమే భావిస్తున్నారే గాని స్త్రీ లేకపోతే సృష్టి లేదని గమనించడం లేదు. ఇక కొందరు మగవాళ్లు మాత్రం ఆడదంటే, ఆటబొమ్మ అనుకుంటున్నారు.. ఏం చేసిన నిశబ్ధంగా భరిస్తుందని భావిస్తున్నారు.. ఇకపోతే మహిళలను మనుషులుగా గుర్తించే సంస్కారం లేని సమాజంలో, ఆడది కనిపిస్తే చాలు, మగాడిలో ఉన్న కామకోరికలు బుసలు కొడతాయి..

 

 

ఈ మధ్యకాలంలో ఆడవాళ్లను నలుగురిలో కూడా లైంగికంగా వేధించడానికి వెనకాడటం లేదు మగపురుగులు. ఎన్ని చట్టాలు చేసిన, కఠిన శిక్షలు విధించిన మార్పుమాత్రం రావడం లేదు. తప్పుచేయాలంటే భయపడే రోజులు పోయాయి.. తప్పు చేసిన వాడే దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి.. ఇందుకు ఉదాహరణగా తన ఉద్యోగధర్మాన్ని సక్రమంగా నిర్వహించవలసిన ఓ కండక్టర్ తోటి ప్రయాణికురాలి పట్ల ప్రవర్తించిన తీరు ఎంత అసహ్యాన్ని కలిగిస్తుందో ఈ వీడియోలో చూస్తే అర్ధం అవుతుంది.. ఈ ఘటనను చూస్తే ఆడవాళ్లూ నిర్భయంగా, స్వేచ్ఛగా, ఏ జంకుగొంకు లేకుండా ఎక్కడికయినా, ఎప్పుడయినా తిరగగలిగే వాతావరణం మన సమాజంలో లేదని అర్ధం అవుతుంది...

 

 

ఇదే కాకుండా అడుగడుగునా అభద్రతా భావంతో తల్లడిల్లే పరిస్థితుల్లో ఆడవాళ్ళ జీవితం కొనసాగుతున్నదని తెలుస్తుంది.. ఇకపోతే కేఎస్ఆర్టీసీ బస్సులో బెంగళూరు నుంచి హసన్ వెళ్తున్న మహిళపట్ల సదరు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ పక్కన కూర్చున్న కండక్టర్, తన చేతులతో ఆ మహిళ దేహంలోని పై భాగాన్ని తాకాలని ప్రయత్నిస్తున్నాడు. దానికి ఆ మహిళ తన చేతులు అడ్డం పెట్టుకుని తీవ్రంగానే ప్రతిఘటిస్తున్న విషయాన్ని వీడియోలో గమనించవచ్చు.

 

 

ఇక అంతకంతకు ఎక్కువవుతున్న ఆ నీచపు కండక్టర్ వికృత చేష్టలను తన ఫోన్లో వీడియో తీసిన బాధితురాలు.. మార్గం మధ్యలోనే బేలూరు క్రాస్ వద్ద బస్సు దిగిపోయింది. వెళ్లిపోయే ముందు కండక్టర్ చెంప చెల్లుమనిపించి మరి వెళ్లింది.. ఇకపోతే ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్టుచేయడంతో ఆ కండక్టర్ వక్రబుద్ధి బయటపడ్దది.. మరి ఇలాంటి సంస్కార హీనులకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందో ఆలోచించండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: