తొందరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ ఎంపిల స్ధానాల భర్తీ వ్యవహారంపై పార్టీ నేతల్లో  బాగా చర్చ జరుగుతోంది. మిగిలిన నేతల సంగతి ఎలాగున్నా నెల్లూరు జిల్లా నేతల్లో మాత్రం విపరీతమైన టెన్షన్ పెంచేస్తోందని చెప్పవచ్చు.  వైసిపికి దక్కబోయే నాలుగు స్ధానాల్లో  జిల్లాలోని సీనియర్ నేతల్లో ఎవరికి దక్కుతుందో నేతలకు అంతు పట్టడం లేదు. జిల్లా నుండి ప్రధానంగా మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు పోటి పడుతున్నట్లు సమాచారం.

 

మేకపాటి విషయం చూస్తే మొదటి నుండి వైఎస్ కుటుంబానికి బాగా సన్నిహితుడు, కావాల్సిన వాడు. వైఎస్ హయాంలో రెండుసార్లు నెల్లూరు  ఎంపిగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో నుండి వచ్చేసినపుడు మేకపాటి కూడా  పార్టీకి రాజీనామా చేశాడు. ఎంపిగా జగన్ రాజీనామా చేయగానే తాను కూడా ఎంపిగా  రాజీనామా చేశాడు. అంటే జగన్ తో పాటు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన ఏకైక ఎంపిగా మేకపాటిని చెప్పుకోవచ్చు.

 

సరే తర్వాత 2012లో  జరిగిన ఉపఎన్నికల్లో మళ్ళీ పోటి చేసి గెలిచాడు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వలేదు. టిడిపి నుండి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చి మేకపాటి కొడుకు గౌతమ్ రెడ్డని మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ముందే ఈ ఏర్పాటు గురించి మేకపాటి-జగన్ మాట్లాడుకున్నారు కాబట్టి ఏ  సమస్యా రాలేదు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హఠాత్తుగా టిడిపి సీనియర్ నేత బీద మస్తాన్ రావు వైసిపిలో చేరారు.

 

బీద వైసిపిలో చేరేముందు రాజ్యసభ సీటును జగన్ హామీ ఇచ్చారనే ప్రచారం పార్టీలో ఉంది.  బిసి సామాజికవర్గానికి చెందిన ఈ మాజీ ఎంఎల్ఏ చంద్రబాబు నాయుడుకు ఎంతటి సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతటి సన్నిహితుడు వైసిపిలో చేరటం అప్పట్లో పార్టీలో సంచలనమైంది. కాబట్టి రాజ్యసభ సీటు హామీ నిజమే అనుకోవాలి. మరి ఇద్దరి నేతల్లో జగన్ మొగ్గు ఎవరి వైపు మొగ్గుతుందో అర్ధంకాక మిగిలిన నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: