జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు పెద్ద షాక్ ఇచ్చారు. ఇంత పెద్ద షాక్ తగులుతుందని పవన్ అస్సలు ఏమాత్రం ఊహించలేదట. రేపల్లె నియోజకవర్గం స్ధాయి సమావేశం ఏర్పాటు చేస్తే పట్టుమని 50 మంది కూడా లేదట.  దాంతో పవన్ ఆశ్చర్యపోయారట. తాను పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే  సమావేశం హాలు కూడా నిండకపోవటమేంటంటూ నిర్వాహకులపై మండిపడ్డారని సమాచారం.

 

గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎలాగూ రాజధాని జిల్లానే కాబట్టి బ్రహ్మాండం ఏదో బద్దలయిపోతుందని అందరూ అంచనా వేసుకున్నారట. కానీ ఆశ్చర్యకరంగా  సమావేశం హాలులో చూస్తే 50 మంది కూడా రాలేదట.  దాంతో ముందు హాస్చర్యపోయిన పవన్ తర్వాత నేతలపై మండిపోయారట.

 

తాను నియోజకవర్గ స్ధాయి సమావేశం ఏర్పాటు చేస్తే కనీసం హాలు కూడా నిండలేదేమిటని తీవ్రంగా ప్రశ్నించారట. దాంతో నేతలు ఏమీ సమాధానం చెప్పలేకపోవటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ ఎక్కడ సమావేశం పెట్టినా లేదా వస్తున్నారని తెలిసినా అభిమానులు పెద్ద ఎత్తున హాజరవ్వటాన్ని అందరూ చూసిందే. కానీ రేపల్లె నియోజకవర్గ సమావేశంలో మాత్రం అంచనాలు ఉల్టాగా కనిపించింది.

 

 ఇందుకు కారణాలేంటని ఆరాతీస్తే బిజెపితో పొత్తు పెట్టుకోవటమే ప్రధానమని తెలిసింది. బిజెపితో పొత్తు పెట్టుకోవటం జనసేనలో చాలామందికి ఏమాత్రం ఇష్టం లేదట. అదే విషయాన్ని పార్టీ నేతలు చెప్పినా పవన్ పట్టించుకోలేదని సమాచారం. అందుకే ఈ విషయమై పవన్ మాట్లాడుతూ విశాల దృక్పధంతో ఆలోచించే తాను బిజెపితో పొత్తులు పెట్టుకున్నట్లు ప్రకటించింది. అభిమానులు ఎలాగూ వస్తారని సమావేశం నిర్వాహకులు అంచనా వేశారట. అయితే ఇది అభిమానుల సమావేశం కాకపోవటంతో వాళ్ళనెవరినీ రమ్మని చెప్పలేదు. పొత్తుల విషయంలో విభేదించటంతో పార్టీ నేతలు కూడా హాజరుకాలేదట. దాంతో మొత్తం మీద పవన్ కు షాక్ తగిలింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: