ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఉగ్రవాదం పెరిగిపోతోన్న  విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని తగ్గించేందుకు ఇప్పటికే పలు దేశాలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ  రోజురోజుకు పెరిగిపోతున్న ఉగ్రవాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి పలు దేశాలు . కాగా  ఉగ్రవాదం నిర్మూలనకు సంబంధించి తాజాగా పారిస్లోని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ  కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులు ఉగ్రవాద సంస్థకు నిధుల  అందజేత ను అడ్డుకునేందుకు మనీలాండరింగ్ కు చెక్ పెట్టేందుకు... నిర్ణయించిన పారిస్లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ  పాకిస్తాన్ దేశాన్ని బ్లాక్ లిస్టులో  పెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

 


 తమ దేశాల్లో ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో ... పాకిస్తాన్ ఇరాన్  తదితర దేశాలు పాటించిన విధానాలపై సమీక్ష జరిపేందుకు... పారిస్లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ ఆరు రోజుల పాటు సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ఈ  సమావేశంలో తీసుకోనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి సంబంధించి ఈ సంస్థ నిర్దేశించిన 27 అంశాల్లో పహరింటికి  అనువుగా  తాము చర్యలు తీసుకున్నామని పాకిస్తాన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే వీటివల్ల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ సంస్థ  సంతృప్తి చెందలేదని  తెలుస్తోంది. 

 

 ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఉగ్రవాది అయినా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పైన లష్కరే తోయిబా లీడర్ జాకీర్ ఉర్  రెహమాన్ లక్మి  మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ భారత్ పాక్  కోరింది. అయితే ఇదే విషయాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దృష్టికి కూడా తెచ్చింది. అయితే ఇండియా పాకిస్తాన్ ఇలా కోరడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే పలుమార్లు ఇదే అంశంపై ఇండియా పాకిస్థాన్ ను  కోరాయి. ఈ క్రమంలోనే ఈ సమావేశంలో పాకిస్థాన్ను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు వార్తలు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: